వైరల్: అరుదైన ట్యాలెంట్ తో ముగ్ధుల్ని చేస్తున్నాడు.. బోర్డుని చూడకుండానే బొమ్మలు గీసేస్తున్నాడు!

మనలో కొంతమందికి అరుదైన కళలు ఉంటాయి.అందుకే వారు మిగతా వారికంటే భిన్నంగా వ్యవహరిస్తారు.

 He Is Impressing People With Rare Talent He Is Drawing Figures Without Looking A-TeluguStop.com

అదే కళలు వున్నవారు వాటిని కాస్త వెరైటీగా ప్రదర్శిస్తూ వుంటారు.బేసిగ్గా కొంతమందికి కుడిచేతి వాటం, మరికొంతమందికి ఎడమచేతి వాటం ఉంటుంది.

అయితే రెండు చేతులతో తమ కళలను ప్రదర్శించేవారు ఇంకా అరుదుగా వుంటారు.ఇపుడు అలాంటి ఓ వ్యక్తి గురించే చెప్పుకోబోతున్నాం.

అది చూసిన వారికి నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు చేతులతో డ్రాయింగ్స్ వేసే సామర్థ్యం ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రెండు చేతులతో రాయడం వరకు ఓకే కానీ.వెనుకకు తిరిగి, బోర్డు వైపు చూడకుండా ఒకేసారి రెండు చేతులతో డ్రాయింగ్ చేయడం నిజంగా ఓ మిరాకిల్ అని చెప్పుకోవాలి.

అలాంటి అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో ఒక్కసారి చూసినట్లయితే.

ఓ వ్యక్తి తన వీపును బోర్డుకి ఆనుకుని కుర్చీపై కూర్చుని రెండు చేతులతో శివాజీ, అతని ప్రత్యర్థి చిత్రాన్ని అవలీలగా గీసేసాడు.

ఇక ఆ రెండు బొమ్మలు గీసేటప్పుడు ఒక్క తప్పు కూడా దొర్లకుండా ఎంతో చాకచక్యంతో తేలిగ్గా డ్రాయింగ్ గీయడం నిజంగా అద్భుతంగా పేర్కొనవచ్చు.సదరు వీడియోని హిందుస్థాన్ నౌ గ్లోబల్ ప్రెస్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.దీనికి ఇప్పటిదాకా 1.5 మిలియన్ల వ్యూస్, 1.49 లక్షల లైక్‌లతో పాటు 2 వేలకు పైగా కామెంట్‌లు రావడం కొసమెరుపు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతని ట్యాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు.అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.మీరు కూడా ఈ వీడియో చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube