సినీ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) కీలక వ్యాఖ్యలు చేశారు.గుంటూరు కారం సినిమా( Guntur Karam ) మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిపారు.
ప్రిన్స్ మహేశ్ బాబును( Mahesh Babu ) దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా గుంటూరు కారం అని దిల్ రాజు పేర్కొన్నారు.ఫ్యామిలీతో వచ్చి సినిమాను ఎంజాయ్ చేయండని తెలిపారు.
గుంటూరు కారం మిడ్ నైట్ షో తరువాత మిశ్రమ స్పందన వచ్చిందని పేర్కొన్నారు.
తాను తన అంచనాను క్రాస్ చెక్ చేసుకోవడానికి సుదర్శన్ లో మళ్లీ చూశానని తెలిపారు.బాగాలేదనే ప్రచారంలో ప్రేక్షకులు నెగిటివ్ మైండ్ తో వెళ్తున్నారని వెల్లడించారు.సినిమా చూసిన వాళ్లంతా బాగా కనెక్ట్ అయి పాజిటివ్ గా చెబుతున్నారని చెప్పారు.
గుంటూరు కారం సినిమా పూర్తి వసూళ్లు పండుగ తరువాత వస్తాయన్నారు.సినిమా బాగుంటే చూస్తారన్న దిల్ రాజు ఎవరూ ఆపలేరని వెల్లడించారు.