మెంతులలో మేలు రకం విత్తనాలు.. ఎరువుల యాజమాన్యం..!

మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో వాటిని ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే అధిక లాభాలు అర్జించవచ్చు.మెంతులను భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తారు కాబట్టి మెంతులకు( Fenugreek ) మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.

 Good Type Of Seeds In Fenugreek.. Ownership Of Fertilizers , Fenugreek ,potash-TeluguStop.com

మెంతులను ఆకుకూరగా సాగు చేస్తే 25 రోజులు, గింజల కోసం సాగు చేస్తే 100 రోజుల సాగు వ్యవధి ఉంటుంది.మెంతులు ఎలాంటి వాతావరణం లో అయినా తట్టుకొని పెరుగగలదు.

ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది.

Telugu Agriculture, Fenugreek, Fenugreek Seeds, Latest Telugu, Nitrogen, Phospho

మెంతులలో మేలురకం విత్తనాల విషయానికి వస్తే.కో 1, హెచ్ 103, ఇసి 4911, మేధి నెం 14, ఆర్ ఎంటి 1, లాం సెలక్షన్ లాంటి రకాల లో ఏదో ఒక రకం ఎంపిక చేసుకుని సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.మెంతులు వేసే ముందు నేలను రెండుసార్లు లోతు దుక్కులు దున్నుకొని భూమిని చదును చేసుకోవాలి.

మడులు ఏర్పాటు చేసుకుని వాటిపై విత్తనాన్ని వెదజల్లుకోవాలి.మొక్కల వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగలడంతో పాటు పొలంలో అంతర కృషి చేయడానికి సులభంగా ఉంటుంది.


Telugu Agriculture, Fenugreek, Fenugreek Seeds, Latest Telugu, Nitrogen, Phospho

ఒక ఎకరం పొలానికి 10 కిలోల విత్తనాలు అవసరం.పొలంలో వేసిన ఎనిమిది రోజులకు విత్తనం మొలకెత్తడం ప్రారంభం అవుతుంది.ఎరువుల విషయానికి వస్తే.సేంద్రియ ఎరువులకు( Organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఆఖరి దుక్కిలో ఒక ఎకరం పొలానికి ఐదు టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.ఇంకా 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం( Phosphorus ), 50 కిలోల పోటాష్ ఎరువులు( Potash fertilizers ) అవసరం.

విత్తుకునే సమయంలో సగం నత్రజని మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను పొలంలో వేసుకోవాలి.మెంతి ఆకులు కత్తిరించిన తర్వాత ఆ సగం నత్రజని ఎరువును పొలంలో వేసుకోవాలి.

నేలలోని తేమ శాతాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడిని అందించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube