తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ నుంచి అంతర్గత ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అంశంపై స్పందించవద్దని సూచనలు చేసిందని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే.45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న పొన్నాల పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.అయితే జనగామ నియోజకవర్గం నుంచి టికెట్ తనకు రాదనే అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీని వీడారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పొన్నాల రాజీనామా వ్యవహారంపై ఇతర నేతలు ఎవరూ స్పందించవద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందనే వార్తలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.