గుడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. మళ్లీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌

ప్రేమమ్( Premam ) సినిమా తో హీరోయిన్ గా సౌత్ ఆడియన్స్ ని మెప్పించిన సాయి పల్లవి తెలుగు లో ఫిదా చిత్రం తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెలిసిందే.శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) చిత్రాలు హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.

 Good News For Sai Pallavi Fans , Sai Pallavi, Fida, Tollywood Flim, Top News, Sh-TeluguStop.com

కనుక ఆయన దర్శకత్వం లో మరో సినిమా ను కూడా సాయి పల్లవి చేసింది.సాయి పల్లవి ( Sai Pallavi )కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది.

అలాగే కంటిన్యూ అయినా బాగానే ఉండేది కానీ సాయి పల్లవి గత సంవత్సర కాలంగా కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.తెలుగు లో ఆమె ఒక్క సినిమా కూడా ప్రస్తుతం చేయడం లేదు.

వచ్చిన అవకాశాలు అన్నింటిని కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది.ఏకంగా మూడు కోట్ల పారితోషకం ఆఫర్ చేసిన కూడా ఆమె ప్రస్తుతానికి తాను సినిమాలు చేసే మూడ్‌ లో లేనట్టు తిరస్కరించినట్లు ఆ మధ్య ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Telugu Fida, Sai Pallavi, Tollywood, Top-Movie

సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరమైనట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సాయి పల్లవి తిరిగి వస్తుందని భావించారు.సాయి పల్లవి అభిమానులు కోరుకున్నట్లుగానే ఆమె తిరిగి నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.ఇటీవల ఒక తమిళ సినిమా( Tamil movie ) లో నటించేందుకు ఈ అమ్మడు సిగ్నల్ ఇచ్చిందట.అంతే కాకుండా తెలుగు లో కూడా ఆమె నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.

అతి త్వరలోనే తెలుగు లో ఆమె సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక సాయి పల్లవి తనకు నచ్చిన కథలు వస్తే వెంటనే సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ఆమె సన్నిహితులు అభిప్రాయం చేస్తున్నారు.

గతంలో మాదిరిగానే కమర్షియల్ చిత్రానికి దూరంగా ఉంటూ పాత్ర కు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని సాయి పల్లవి భావిస్తుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఇప్పటికే ఆమె మేనేజర్ కొత్త అవకాశాలను కథలను పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube