తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా, బిజెపి , బీఆర్ఎస్ పార్టీలు దూకుడుగా ముందుకు వెళుతున్నా, తెలంగాణ కాంగ్రెస్ లో( Congress Party ) మాత్రం గ్రూపు రాజకీయాలే ప్రధాన అజెండగా మారిపోయాయి. ఇప్పుడు ఏదో ఒక వివాదం నాయకులు మధ్య చోటు చేసుకుంటూనే ఉంటోంది.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అసంతృప్తిని వ్యక్తం చేయడం, అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ఇలా ఈ విభేదాలతోనే సమయం అంతా సరిపోతుంది.బీఆర్ఎస్, బిజెపిలను ధీటుగా ఎదుర్కొని తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా పార్టీలో మార్పు, చేర్పులకు వీలుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావు థాక్రే ను( Manikrao Thakre ) నియమించింది.
ఇప్పటికే అనేక సార్లు ఆయన హైదరాబాద్ కు వచ్చి ముఖ్య నాయకులు అందరితోనూ అనేకమార్లు సమావేశాలు నిర్వహించారు.
అయినా పరిస్థితిలో మార్పు అయితే కనిపించలేదు.
ఈ క్రమంలోని రాబోయే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం.కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోని ప్రధాన కార్యదర్శల సంఖ్యను 84 నుంచి 119 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు .ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఇప్పటికే అధిష్టానం ఏఐసీసీ కార్యదర్సులను ఆదేశించింది.దీంతో పాటు, ప్రధాన కార్యదర్శులు ఒక్కొక్కరికి ఒక్కో నియోజకవర్గాన్ని కేటాయించాలని పార్టీ వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్యరావు థాక్రే ఆదేశాలు జారీ చేశారు.
వీటితో పాటు పీసీసీ లోకి మరో ముగ్గురు ఉపాధ్యక్షులను నియమించనున్నట్లు సమాచారం.గతంలో ఏఐసిసి ప్రకటించిన పదవులతో కాంగ్రెస్ లో కలకలం రేగిన నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న నాయకులకు ఈ పదవులు ఇచ్చి వారిని బుజ్జగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఎన్నికలు ఈ ఏడాదిలోనే ఉండడంతో , బిఆర్ఎస్, బిజెపిలు దూకుడుగా ముందుకు వెళుతున్నాయి.
ప్రజల్లో తమ పార్టీల బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పోటీగా పాదయాత్రలు చేయాలని భావించినా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) మినహా, మిగతా నాయకులు పాదయాత్రలు పెట్టలేదు.పదవుల విషయంలో చాలామంది నాయకులు అసంతృప్తితో ఉండడంతో, ఈ పదవుల నియామకాల పై కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ పరిణామాల తర్వాత అయినా తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందేమో చూడాలి.