బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొన్నేళ్ల క్రితం వరకు మంచి అనుబంధం ఉండేది.ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు సైతం చాలా తక్కువ అనే సంగతి తెలిసిందే.
అయితే బాలయ్య( Balakrishna ), జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందంటూ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.తాజాగా ఒక ఈవెంట్ లో భాగంగా బాలయ్య తనను బాబాయ్ అని పిలవవద్దని జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ), కళ్యాణ్ రామ్ లకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా టీడీపీకి( TDP ) సంబంధించిన సమస్యల గురించి స్పందించడానికి ఆసక్తి చూపడం లేదు.బాలయ్య సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా తారక్ రియాక్ట్ కావడం లేదు.
బాలయ్య, తారక్ కలిసి సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో నందమూరి హీరోల మధ్య పంతాలు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి.నందమూరి హీరోలు( Nandamuri Heroes ) కలిసి ఉండాలని అప్పుడే ఫ్యాన్స్ సైతం మరింత సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు.బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 2024లో పోటీ పడతాయనే వార్త సైతం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా( Devara Movie )కే పూర్తిస్థాయిలో పరిమితమై ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు.దేవర సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.
తారక్ సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.బాలయ్య, తారక్ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరైనా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.