సర్వమతసమ్మేళనానికి ప్రతీక ఖమ్మం.ఇక్కడ హిందు, ముస్లిం, క్రిస్టియన్ బాయి బాయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో నాగరిక సమాజ నిర్మాణం.
నవరాత్రోత్సవ పూజలు ఫలించి మంచి వర్షాలతో, పంటలు బాగా పండాలి.ఖమ్మం జిల్లా కేంద్రంలో ఘనంగా గణేష్ శోభాయాత్ర ప్రారంభం.
ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఖమ్మం జిల్లా యావత్ సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
గణేష్ నవరాత్రోత్సవాలను ముగింపు సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఖమ్మం నగరం బ్రాహ్మణ బజార్ లోని శివాలయం వద్ద AMC చైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న, సాయి కిరణ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణనాథుడి వద్ద మేయర్ పునుకొల్లు నీరజ గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ గారు, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా గారు, ZP చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, సుడా చైర్మన్ విజయ్ గార్లతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జెండా ఊపి నిమజ్జనం కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లడుతూ.
భక్తుల పూజలు అందుకున్న గణనాధుడి శోభాయాత్ర కన్నుల పండుగగా ఉందన్నారు.ఇక్కడ జరుగుతున్న పండుగలు అన్నింటిలో సర్వమతాల భాగస్వామ్యం ఉండడం ప్రత్యేకం అన్నారు.
అది రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా దసరా, సంక్రాంతి అయినా అన్ని కులాలు, అన్ని మాతాలు కలిసి జరుపుకోవడం ఈ గడ్డకున్న ప్రత్యేకత అని అన్నారు.గంగా,జమునా, తహజీబ్ అన్న మహాత్మా గాంధీ పదాలు ఖచ్చితంగా ఖమ్మం కే వర్తిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా గణేష్ ఉత్సవ కమిటీ, స్థానిక భజన మండలి అద్వర్యంలో ఏడూ దశాబ్దాలుగా కొనసాగుతున్న వినాయకచవితి నవరాత్రోత్సవాలలోనూ, చివరిగా జరుగు గణేష్ శోభాయాత్రలోనూ హిందు, ముస్లిం, క్రిస్టియన్ లు పాలు పంచుకోవడం ఖమ్మం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు.నవరాత్రోత్సవ పూజలు ఫలించి మంచి వర్షాలు పడి రైతులు వేసిన అన్ని పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.