మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండగ సీజన్ అంటే ముఖ్యంగా సంక్రాంతి, దసరా అనే చెప్పుకోవాలి.మరి సంక్రాంతి వార్ ఈసారి చప్పచప్పగానే ముగిసింది.
ఇక దసరా వార్ అయినా ఈ ఏడాది రసవత్తరంగా ఉండాలి అని ప్రేక్షకులు కోరుకున్నారు.దీంతో ఫ్యాన్స్ కోరికను నెరవేర్చడానికి హీరోలు కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నారు.
ఈసారి దసరా బరిలో మంచి భారీ ప్రాజెక్ట్ సినిమాలు రంగంలోకి దిగి పోటీ పడనున్నాయి.
మరి ఇప్పటి వరకు 4 సినిమాలు ఈసారి దసరా బరిలోకి దిగబోతున్నాయి అని తెలుస్తుంది.
ఈ నాలుగు కూడా బడా సినిమాలే.దీంతో ఈసారి పోటీ తప్పదని అర్ధం అవుతుంది.
మరి ఈ నాలుగు సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా కూడా ఉంది.దక్ష నాగర్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 30నే రిలీజ్ కాబోతుంది.
ఇక ఆ తర్వాత వరుసలో మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళ మూవీ రీమేక్ గా తెరకెక్కుతుంది.మరి సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.
ఆ తర్వాత మరొక సీనియర్ హీరో నాగార్జున కూడా ఈసారి దసరా బరిలో దిగబోతున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ది గోస్ట్’ సినిమాతో నాగ్ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసారు.
ఇక నాలుగవ సినిమా కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ కూడా దసరా కానుకగా సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్ హీరోగా కార్తీ, జయం రవి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ నాలుగు సినిమా వారం గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
మరి ఏ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.