జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్లు వేశారు.పవన్ తన లారీకి గతంలో కొండగట్టు, విజయవాడలో పూజలు చేశారన్న ఆయన ఇప్పుడు అన్నవరంలో పూజలు చేశారని అన్నారు.
లారీకి మాటిమాటికి పూజలు ఎందుకని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబు కోసం పని చేసే పార్టీ జనసేన అని తెలిపారు.
చెప్పులు నీకు మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించిన ఆయన తనూ చెప్పులు చూపించగలనని చెప్పారు.వ్యూహాలను చంద్రబాబును నమ్ముకుంటే చిల్లరే వస్తుందని పేర్కొన్నారు.
ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీకి వెళ్లగలరని వెల్లడించారు.