తూర్పు గోదావరి జిల్లా, రాజోలు: అమలాపురం కేంద్రంగా కొత్తగా ఏర్పడుతున్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలంటూ మాజీ మంత్రి గొల్లపల్లి సాధన దీక్ష.కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.అంబేద్కర్ పెట్టిన బిక్ష వల్లనే నేను రాజకీయ పదవులు అనుభవించాను.
26 జిల్లాలు ప్రకటించిన ప్రభుత్వానికి ఒక్క జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి గుర్తురాలేదు.గత నాలుగు రోజులుగా అంబేద్కర్ వాదులు అంతా దీక్షలు చేస్తున్నారు.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 4 రిజర్వుడ్ నియోజకవర్గాలు వున్నాయి.కోనసీమ సమైక్యవాదంతో కూడిన ప్రాంతం.