హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను( Shiva Balakrishna ) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.శివబాలకృష్ణను ఎనిమిది రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు( ACB Court ) అనుమతి ఇచ్చింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచిన సంగతి తెలిసిందే.ఏసీబీ అధికారుల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం శివబాలకృష్ణ కస్టడీకి( Shiva Balakrishna Custody ) అనుమతినిచ్చింది.
అయితే శివ బాలకృష్ణ నివాసం సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు( ACB Raids ) నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శివబాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరికీ కలిపి మొత్తం 15 లాకర్లు ఉన్నట్లు గుర్తించారు.ఆయనను కస్టడీకి తీసుకోనున్న అధికారులు బ్యాంక్ లాకర్లను( Bank Lockers ) తెరిచే అవకాశం ఉంది.