పేదరికంతో పోరాటం చేస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఒక వ్యక్తి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Five Government Jobs Got Bharath Inspirational Story Telugu , Five Government-TeluguStop.com

అయితే తెలంగాణకు చెందిన భరత్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు.జనగామ జిల్లా( Jangaon )కు చెందిన భరత్ ఒకవైపు పేదరికం మరోవైపు విమర్శలతో కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Telugu Tspsc, Bharath, Jobs, Jangaon, Town-Inspirational Storys

ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం భరత్ ఏకంగా ఐదేళ్లు కష్టపడ్డారు.భరత్ తల్లీదండ్రులు సాధారణ కూలీలు కాగా భరత్( Bharath ) ఈ స్థాయికి చేరుకోవడం కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.ఆ తర్వాత డిప్లొమా చేసిన భరత్ ఓయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.కాకతీయ యూనివర్సిటీలో భరత్ ఎంటెక్ పూర్తి చేయడం గమనార్హం.భరత్ కృషి, పట్టుదలతో ఈ స్థాయికి ఎదగడం గమనార్హం.

Telugu Tspsc, Bharath, Jobs, Jangaon, Town-Inspirational Storys

ఎన్నో సవాళ్లు ఎదురైనా నిరంత సాధనతో భరత్ తను కన్న కలలను సాకారం చేసుకున్నారు.కొడుకు గొప్ప స్థితిలో ఉండాలని తల్లీదండ్రులు కన్న కలను భరత్ నిజం చేశారు.గతంలో కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు మార్కుల వల్ల ప్రభుత్వ ఉద్యోగం మిస్ అయిందని భరత్ అన్నారు.

తాజాగా విడుదలైన టీఎస్పీఎస్సీ ( TSPSC )జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం భరత్ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.భరత్ ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో కలిసి ఐదు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెబుతున్నారు.అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్4 ఉద్యోగాలు వస్తాయని భరత్ చెప్పుకొచ్చారు.

భరత్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube