బిఆర్‌ఎస్( BRS party ) వర్కింగ్ ప్రసిడెంట్ ఐటీ శాఖమంత్రి కేటిఆర్ ( KTR )ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.గతవారం బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన టైమ్ లో కూడా ఆయన అందుబాటులో లేరు.
అయితే టికెట్ లభించని నేతల ఒత్తిడి తనపై పడకూడదనే భావనతోనే కేటిఆర్ సరిగ్గా అభ్యర్థుల ప్రకటన టైమ్ విదేశాలకు చెక్కేశారని గత వారం రోజులుగా పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కాగా తొలి జాబితాలోనే దాదాపు 115 స్థానాలను ప్రకటించి ప్రతిపక్షాలకు అందని విధంగా వ్యూహరచన చేశారు గులాబీ బాస్.
ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో దాదాపు ఓ నాలుగు స్థానాలు మినహా అన్నీ సీట్లను సిట్టింగ్ లకే కట్టబెట్టారు.

అయితే ఇప్పుడు ప్రకటించిన స్థానాలు శాశ్వతం కాదని ఇందులో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని అధినేత కేసిఆర్( CM kcr ) ప్రకటన రోజే క్లారిటీగా తేల్చి చెప్పారు దీంతో ప్రస్తుతం సీటు లభించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమంది సీటు నిలుపుకుంటారనే చర్చ జరుగుతోంది.కాగా తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 15 నుంచి 20 స్థానాల్లో సీటు లభించిన అభ్యర్థులకు బీఫామ్ కష్టమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.కొన్ని నియోజిక వర్గాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని బిఆర్‌ఎస్ అంతర్గత సర్వేలో వెల్లడైందట.

అందుకే సరిగ్గా ఎన్నికల టైమ్ నాటికి వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ లకు బిఫామ్ ఇవ్వకుండా ఆశావాహులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట.అయితే టికెట్ల ప్రకటన అధినేత కేసిఆర్ చేసినప్పటికీ పూర్తి స్థాయి అభ్యర్థుల ఎంపిక మాత్రం వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ చేసే అవకాశం ఉందట.ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత బిఫామ్ ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వినికిడి.దీంతో ప్రస్తుతం టికెట్లు లభించిన వారిలో కూడా ఆ టికెట్ నిలుపుకోగలమా అనే ఆందోళన పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
మరి ప్రస్తుతం ప్రకటించిన 115 మంది అభ్యర్థులలో ఎవరెవరు ఫైనల్ అవుతారో చూడాలి.