తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల విషయం పక్కన పెడితే ఇండస్ట్రీ ని ఒక మూడు దశాబ్దాల పాటు ఏలిన హీరో చిరంజీవి( Chiranjeevi )…ఈయన తీసిన సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి మంచి రికార్డ్ లు క్రియేట్ చేసేవి…కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) చూసిన చిరంజీవి అభిమానులు మాత్రం ఆ సినిమా పట్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నట్లు గా తెలుస్తుంది…ఎందుకంటే ఈ సినిమా లో ఒక పాత కథ తో వచ్చి అదే రొటీన్ మాస ఫార్ములా మూవీ తీసి జనాల పైకి వదిలారు…ఇక ఈ సినిమా చూసిన చాలా మంది అభిమానులు చిరంజీవి కి ఒక సలహా కూడా ఇస్తున్నారు…అదేంటంటే రజనీకాంత్ జైలర్ సినిమా చూసి, రజినీని చూసి నేర్చుకో చిరంజీవి ఈ ఏజ్ లో కూడా ఇంకా ఆ హీరోయిన్స్ తో పాటలు స్టెప్పులు వేయడం ఎందుకు… ఒక మంచి కథ తో సినిమా చేసి సక్సెస్ కొట్టచ్చు కదా మలయాళం లో టాప్ హీరోలు అయిన మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులు కూడా ఈ వయసులో వాళ్ల ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ అందరిని అకట్టుకుంటున్నారు…
ఇక అందుకే చిరంజీవి ని కూడా తన ఫ్యాన్స్ ఒక్కటే కోరుకుంటున్నారు ఏంటంటే ఫస్ట్ రీమేక్ సినిమాలు అపేసి ఒక మంచి సినిమా తీయండి అది పక్క ఆడుతుంది….అల డిఫరెంట్ గాత్రీ చేస్తూ సినిమాలు చేయచ్చు కదా ఎందుకు రీమేక్ సినిమాలు( Remake movies ) చేసి పరువు అంత పోగుట్టుకుంటున్నారు…ఇప్పటికైనా మంచి సినిమాలు తీసి ఇక ముందు వచ్చే హీరోలకి ఒక పెద్ద మనిషి గా ఉంటూ మంచి సక్సెస్ లు అందుకోండి అంటూ చిరంజీవి ఫ్యాన్స్ సైతం అదే భావనని వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఇది అంత చూస్తున్న ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం ప్రతి సినిమా విషయ లో చిరంజీవి ని ఊరికే నిందిస్తున్నారు ఆయన చేసే సినిమాల్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది దాన్ని గమనించండి ఒక డైరక్టర్ మంచి మూవీ తీయకపోతే అది చిరంజీవి గారి తప్పు ఎలా అవుతుంది అంటూ చిరంజీవి మీద కామెంట్ చేసే అందరికీ ఇచ్చి పడేశారు…