రజినీకాంత్( Rajinikanth ) హీరో గా వచ్చిన జైలర్ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది ఉమయితే నిజానికి ఈయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడం తో జైలర్ సినిమా మీద పెద్దగా అంచనాలు మాత్రం లేకుండా పోయాయి…అందుకే నార్మల్ గా రిలీజ్ అయిన జైలర్ సినిమా మొదటి షో నుంచే సూపర్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు వెళ్తుంది.
అయితే ఈ సినిమా మొత్తం లో హైలెట్ అయింది ఏంటంటే కన్నడ హీరో అయిన శివ రాజ్ కుమార్( Shiva Rajkumar ) మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ లాంటి వాళ్ళు వచ్చి ఈ సినిమా లో ఒక స్పెషల్ రోల్ లో నటించడం చాలా వరకు అందరిని ఇంప్రెస్స్ చేసింది అందుకే ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది… మలయాళం, కన్నడ లో కూడా ఈ సినిమా సక్సెస్ తో దూసుకుపోతుంది…అయితే తెలుగు లో కూడా రిలీజ్ చేశారు కదా ఓన్లీ మలయాళం కన్నడ స్టార్లు అయిన శివన్న మోహన్ లాల్( Mohanlal ) ను మాత్రమే పెట్టారు కానీ తెలుగు హీరో నీ ఎందుకు పెట్టలేదు అంటూ చాలా గొడవలు అవుతున్నాయి.
అయితే సినిమా కోసం తెలుగు లో గెస్ట్ రోల్ గా బాలయ్య ( Balakrishna )ని తీసుకుందాం అనుకున్నారట కానీ లాస్ట్.మినిట్ లో ఏం జరిగిందో ఏమో కానీ బాలయ్య ఈ షూట్ లో పాల్గొనలేదు…అయితే ఇదే విషయాన్ని రీసెంట్ గా జైలార్ సినిమా డైరెక్టర్ అయిన నెల్సన్ కూడా చెప్పడం జరిగింది…ఇక ఈ న్యూస్ తెలిసిన చాలా మంది జైలర్ సినిమాలో బాలయ్య ఉంటే ఈ సీన్ ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేది అంటూ కామెంట్లు చేస్తున్నారు అలాగే వల్ల ముగ్గురి లో బాలయ్యనే హైలెట్ అయ్యేవాడు అంటూ కమెంటు కూడా చేస్తున్నారు…