ఆస్కార్ ప్రతిమను ఎందుకు నగ్నంగా డిజైన్ చేసారో? ఎవరు చేసారో తెలుసా?

ఆస్కార్ అవార్డును ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆస్కార్ అంటేనే ప్రతి నటుడు కళలు కనే స్వప్నం.

 Facts About The Oscar Award Details, , Oscar Award, Fascinating Facts, About Osc-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీ నటులు ఈ ఆస్కార్ అవార్డు కోసం కళలు కంటూనే ఉంటారు.తమ జీవితంలో ఒక్కసారి అయినా ఆ అవార్డు అందుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.

అయితే ఇది అందరికి సాధ్యం కాదు.ఆస్కార్ అవార్డు అనేది చాలా అరుదుగా మన ఇండియా నటీనటులకు వరిస్తుంది అని చెప్పాలి.ఇక ఈ మధ్య కొన్ని రోజులుగా మన టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఈసారి ఆస్కార్ రేస్ లో ఉన్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ఎన్టీఆర్ కనుక ఆస్కార్ అవార్డు అందుకుంటే అది సంచలనమే అని చెప్పాలి.

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీఆర్ పేరు వినిపించడంతో మన తెలుగు ప్రేక్షకులు సైతం ఆ ప్రతిష్టాత్మక ఆస్కార్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఆస్కార్ అవార్డు ఎవరు తయారు చేసారు?అసలు దీని చరిత్ర ఏంటి? ఈ ఆస్కార్ ప్రతిమ ఎందుకు నగ్నంగా ఉంటుంది అం ఏ విషయాల గురించి ఆరా తీస్తున్నారు.

Telugu Oscar Award, Fernandez, Kendrick, Mgm Studios, Ntr Oscar Award-Movie

అసలు ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును దేనితో తయారు చేస్తారు అంటే కాంస్యంతో తయారు చేస్తారు.ఆ తర్వాత ఆ ప్రతిమపై 24 క్యారెట్ల గోల్డ్ పోత పోస్తారు.దీంతో ఈ ఆస్కార్ అవార్డు అందంగా మెరిసి పోతుంది.ఇక ఈ క్రమంలోనే ఈ ప్రతిమ నగ్నంగా ఎందుకు తయారు చేస్తారు అని కూడా చాలా మందికి సందేహం వస్తుంది.

ఈ ఆస్కార్ ప్రతిమను ఎంజిఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ తయారు చేసాడు.దీనిని నగ్నంగా ఎందుకు తయారు చేసాడు అంటే.

ఈయన ఈ ప్రతిమను సృష్టించేటప్పుడు ఈ డైరెక్టర్ ఫెర్నాండజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి ఈ డిజైన్ చేసాడట.అందుకే ప్రతిమ కూడా నగ్నంగా ఉంటుంది.

అతడి ఆకారం నుండి వచ్చిన ప్రతిమనే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube