ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే ఒకసారి రాష్ట్రంలో పర్యటించడం జరిగింది.వచ్చే వారంలో మరోసారి పర్యటించబోతున్నారు.2019 ఎన్నికల కంటే ముందుగానే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటువంటి పరిస్థితులలో ఏపీలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటలతుటాలు గట్టిగా పేలుతున్నాయి.తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు( Chandrababu ) ఎవరికీ ఏం చేశారని కదలి రావాలి అంటూ ఎద్దేవా చేశారు.ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదు అన్నారు.ఎంతసేపు సీఎం జగన్ ని దూషించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కనిగిరి గుర్తుకు రాలేదా.? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి.అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసింది ఏమీ లేదు.14 ఏళ్ల పాలనలో గ్రామాలలో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారా.? చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా.? ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెబుతున్నారు అంటూ పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు.