ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ (76) ఇటీవలే 35 ఏళ్ల మహిళతో కలిసి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు.ఆ యువతి మరెవరో కాదు తన రెండో భార్య హీడే బెజుడెన్‌హౌట్ కూతురు.
నిజానికి ఈమె సొంత కూతురు కాదు.తన రెండో భార్య మొదటి భర్తతో కలిసి కన్న సంతానం.
అంటే ఆమె ఇతడికి బిడ్డ వరుస లేదా స్టెప్ డాటర్ అవుతుంది.అయితే కూతురు వరసయ్యే మహిళను పెళ్లి చేసుకుని, ఆమెతో పిల్లల్ని కని ఆ విషయాన్ని సిగ్గులేకుండా బయటకు చెప్పకుంటున్న ఎర్రోల్ పై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ విమర్శలకు ప్రతిస్పందనగా ఇందులో పెద్ద తప్పు ఏముంది అన్నట్లుగా అతను స్పందించడం మరో వివాదానికి దారి తీసింది.
తాజాగా ఇతడి గురించి మరొక సంచలన వార్త బయటకు వచ్చింది.76 ఏళ్ల వయస్సులో కూడా ఇతడు తన వీర్యం దానం చేస్తున్నాడట.తన వీర్యంతో ఎలాన్ మస్క్‌లు వంటి కొడుకులను కనేందుకు చాలామంది వీర్యదానం కోసం విజ్ఞప్తి చేస్తున్నారని తాజాగా అతడు వెల్లడించాడు.
రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.‘‘ఈ భూ ప్రపంచం మొత్తంలో అత్యంత ధనవంతుడు, తెలివైనవాడు ఎలాన్ మస్క్‌ను కన్న తండ్రిని నేను. ఆ అసాధారణమైన జెనటిక్స్ నా నుంచే అతడికి వెళ్ళాయనేది కాదనలేని నిజం.అలాంటి గొప్పవాడిని, భవిష్యత్తు మార్చగల సమర్థుడని కనాలంటే నా వీర్యంతోనే సాధ్యమవుతుంది.అందుకే, వేలాది మంది మహిళలు నా వీర్యం కోసం ఎగబడుతున్నారు.” అని చెప్పి షాక్ ఇచ్చాడు.

ముసలి వయసులో తండ్రి అయిన ఎర్రోల్ తన వీర్యం అందరికీ ఇవ్వనని అంటున్నాడు.కొలంబియాలోని ఓ సంస్థకు మాత్రమే ఉచితంగా వీర్యదానం చేస్తానంటున్నాడు.హై-క్లాస్, ధనిక మహిళలు గర్భం దాల్చడానికి మాత్రమే ఆ సంస్థ తన వీర్యాన్ని దానం చేస్తోందని తెలిపాడు.ఈ సంస్థ తాను వీర్యదానం చేస్తున్నందుకు గాను ఫస్ట్ క్లాస్ ట్రావెల్, ఫైవ్ స్టార్ హోటల్ వంటి సకల సౌకర్యాలు ఇతనికి అందిస్తున్నాయి.