Anand Mahindra Manchu hills : మంచు కొండల్లో ఎన్నికల విధులు.. అధికారులపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు

భారత దేశం ఎన్నో విభిన్న ప్రాంతాలు, జాతులకు నిలయం.ఎత్తైన కొండలు, లోయలు, పీఠభూములు ఇలా ఎన్నో వైవిధ్యమైన ప్రాంతాలు ఉంటాయి.

 Election Duties In Manchu Hills Anand Mahindra Showered Praise On Officials , An-TeluguStop.com

ఇక మంచు కొండలు చూపరులకు కనువిందు చేస్తాయి.అయితే అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం అధికారులకు చుక్కలు కనపడతాయి.

ఎత్తైన మంచు కొండల్లో విధులు నిర్వహించడం వారికి సవాల్ విసురుతుంది.అయినప్పటికీ వారు తమ విధులను ఎన్నికల అధికారులు విజయవంతంగా నిర్వహిస్తారు.

తాజాగా ఇదే తరహాలో హిమాచల్ ప్రదేశ్‌లో కొందరు ఎన్నికల విధులు నిర్వహించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని చసక్ బటోరి పోలింగ్ స్టేషన్‌కు మంచులో ట్రెక్కింగ్ చేస్తూ పోలింగ్ అధికారులు వెళ్తున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు.వారి పనితీరుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.అధికారులు ఆరు గంటల పాటు దట్టమైన మంచు పొరల్లో 15 కిలోమీటర్లు నడిచారు.దీనికి సంబంధించిన చిన్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది.ఆనంద్ మహీంద్రా ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేవారు.పోలింగ్ అధికారులు చీలమండల లోతు మంచులో ట్రెక్కింగ్‌ చేయడం చూడవచ్చు.

వాస్తవానికి, వారు హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌కు వెళుతున్నారు.వారు చలికాలపు దుస్తులు ధరించి, 12,000 అడుగుల ఎత్తులో 15 కిలోమీటర్లు నడిచారు.

అదే సమయంలో భారీ సామగ్రిని కూడా తీసుకువెళ్లారు.ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఎన్నికల విధుల కోసం అధికారులు పడుతున్న కష్టాలను పలువురు ప్రశంసిస్తున్నారు.నెటిజన్లు కూడా పోలింగ్ అధికారుల విధి నిర్వహణ, అంకితభావాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube