తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా ఓట్ల కోసమేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో పేదలకు సరైన విద్య, వైద్యం అందడం లేదని చెప్పారు.
ఓట్ల కోసమే కేసీఆర్ పథకాలన్న ఎంపీ కోమటిరెడ్డి పీఏసీ సమావేశంలో టీఆర్టీ అభ్యర్థుల సమస్యపై చర్చిస్తామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ మొదటి ప్రాధాన్యత విద్యనేనని స్పష్టం చేశారు.
స్కూళ్ల విషయంలో జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని వెల్లడించారు.