అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం( Adipurush ) రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.రామాయణం ని వక్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారని.
గ్రాఫిక్స్ కూడా కార్టూన్ బొమ్మలను చూసినట్టుగానే అనిపించిందని, అందుకే అలాంటి రెస్పాన్స్ వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే ప్రభాస్ కి మూవీ ఔట్పుట్ పై చాలా అనుమానాలు వచ్చాయట.
వెండితెర మీద ఈ సినిమా చూస్తున్నప్ప్పుడు మనకి అనిపించే ఉండొచ్చు, అసలు ప్రభాస్ చిన్నప్పటి నుండి రామాయణం నేపథ్యం లో వచ్చిన సినిమాలే చూడలేదా?, కనీసం ఆ సినిమాలు చూసి ఉన్నా డైరెక్టర్ ఇలా తీస్తున్నప్పుడు చెప్పే వాడు అని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) ని షూటింగ్ జరుగుతున్న సమయం లో ప్రభాస్ కి చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ముఖ్యంగా రావణాసురిడి గెటప్ చూసి ప్రభాస్( Prabhas ) అది రావణుడు అంటే నమ్మలేకపోయాడట.జనాలు ఇలా తీస్తే కొడుతారు, కచ్చితంగా ఇలా వర్కౌట్ అవ్వదు, దయచేసి పురాణాల్లో ఉన్నట్టుగానే తియ్యి అని పాత ఎన్టీఆర్ సినిమాలను కొన్ని చూడమని సజస్ట్ చేసాడట.
కానీ ఓం రౌత్ ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు నన్ను నమ్ము డార్లింగ్ , ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చి సినిమా తీసాడట.విడుదలైన తర్వాత దాని రెస్పాన్స్ ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే.
టీజర్ అప్పుడు నెగటివ్ రివ్యూస్( Adipurush Negative Talk ) రావడం తో ప్రభాస్ సలహా మేరకు గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేసి, 3D లో విడుదల చేసారు.

ప్రభాస్ మాటకి గౌరవం ఇచ్చి 3D లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేసారు.లేకపోతే ఘోరమైన అవమానం ఎదురయ్యేది అని విశ్లేషకుల అభిప్రాయం.ఎందుకంటే 3D వెర్షన్ లో వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే 2D వెర్షన్ వసూళ్లు చాలా తక్కువ.
కనీస స్థాయిలో కూడా రికవరీ చెయ్యలేకపోయింది 2D వెర్షన్.రెండు వెర్షన్స్ కి కలిపి మూడు రోజుల తర్వాత వచ్చిన వసూళ్లు కనీసం 50 కోట్లు కూడా లేదు.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 260 కోట్ల రూపాయలకు జరగగా, ఫుల్ రన్ లో 180 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది.సుమారుగా 80 కోట్ల రూపాయిలు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.
ఒకవేళ ప్రభాస్ చెప్పినట్టు గా పురాణాలకు తగ్గట్టుగా తీసి ఉంటే ఈ చిత్ర వెయ్యి కోట్లు కొల్లగొట్టేదని అంటున్నారు.







