ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురు,శుక్రవారాల్లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఈ జబర్దస్త్ షో నుంచి పలువురు కమెడియన్లు వెండి తెరకు హీరోలుగా కూడా పరిచయం అయ్యారు.
అంతలా జబర్దస్త్ కామెడీ షో కొంతమందికి లైఫ్ ఇచ్చింది.అయితే తాజాగా జబర్దస్త్ షోలో పనిచేసే ఇద్దరు కమెడియన్లు వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన అందరికీ తెలిసిందే.
అయితే ఈ ప్రభావం ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో పై పడినట్లు తెలుస్తోంది.
అయితే పట్టుబడిన ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి లు హైపర్ ఆది టీంలో పనిచేస్తున్నారు.
అయితే ఇందులో పరదేశి కమెడియన్ గా నటిస్తూనే మరో పక్క స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు.దీంతో ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేయాలంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుండటంతో హైపర్ ఆది దొరబాబు, పరదేశి లకు కొంతకాలం విరామం ఇచ్చి మళ్లీ తన స్కిట్ లోకి తీసుకు రానున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే జబర్దస్త్ షో నిర్వాహకులు కూడా ఈ ఇద్దరి పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వేటు వేశారు. కానీ నీ హైపర్ ఆది జబర్దస్త్ షో నిర్వాహకులను బ్రతిమాలి వారిని జబర్దస్త్ షోలో పని చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.
దీంతో ఈసారికి హైపర్ ఆది చెప్పడంతో ఇద్దరిని కొంతకాలం తర్వాత మళ్లీ జబర్దస్త్ షో లో నటించేందుకు అనుమతించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దొరబాబు పరదేశి లు తమ స్నేహితుడిని వేరే పని నిమిత్తం కలవడానికి విశాఖపట్టణానికి వెళ్లారని కానీ అక్కడ తన స్నేహితుడు చేస్తున్నటువంటి ఈ భాగోతం తమకు తెలియదని దొరబాబు వాపోతున్నాడు.అంతేగాక కావాలనే కొందరు ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ తమపై లేనిపోని నిందలు మోపి తున్నారని దొరబాబు అంటున్నాడు.అయితే ఇప్పటికే దొరబాబు భార్య నందిని రెడ్డి కూడా ఈ విషయంలో తన భర్తకి అండదండగా నిలుస్తూ ధైర్యం చెబుతోంది.