ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదికపైకి వెళ్లిన ట్రంప్ వింతైన పాట విని అదరలేదు, బెదరలేదు!

డోనాల్డ్ ట్రంప్( Donald Trump ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయన ఎవరో జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

 Donald Trump Marches Onto Iowa Stage As Song About Going To Prison Plays Details-TeluguStop.com

ఈ ప్రపంచానికి అతడు బాగా సుపరిచితుడు.ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్.

ఇటీవల పోర్న్‌స్టార్‌కి మనీ చెల్లింపుల కేసులో ఈ రిపబ్లికన్‌ పార్టీ నేత అరెస్ట్ అయిన సంగతి విదితమే.అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి అంటూ న్యూయార్క్ లో( New York ) న్యూస్ చక్కెర్లు కొట్టింది.2024 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకుంటున్న ఈ రిపబ్లికన్ బిలియనీర్‌కి ఇది పెద్ద దెబ్బే అని పెద్ద పెద్ద మీడియాలు సైతం దుయ్యబట్టాయి.

Telugu America, Donald Trump, Prison, Iowa, Latest, Nri, Pornstormy, Republican,

ఏది ఏమైనప్పటికీ డోనాల్డ్ మాత్రం అస్సలు తగ్గడంలేదు.దానికి తాజాగా జరిగిన ఈ సంఘటనే ఓ ఉదాహరణ.2024 అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఐవాలో( Iowa ) అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదిక పైకి వెళ్తుండగా ‘ఒకరు జైలుకు వెళ్లవచ్చు.మరొకరు అధ్యక్షుడిగా ఉండవచ్చు.(One could end up going to prison, one just might be president) అనే పాట రావడంతో సభ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.కొంతమంది నవ్వుకున్నారు కూడా.

ఎందుకంటే జైలు అనే పదం ఆ లిరిక్స్ లో వచ్చింది.ఈ సందర్భంలో ట్రంప్‌ పెద్దగా తడుముకోకుండా తన పిడికిలి బిగించి వారికి అభివాదం చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను అమెరికాకు చెందిన ఓ విలేకరి ట్విటర్‌ లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది.

Telugu America, Donald Trump, Prison, Iowa, Latest, Nri, Pornstormy, Republican,

ఇకపోతే 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో.శృంగారతార స్టార్మీ డేనియల్స్‌ తో( Stormy Daniels ) సంబంధాన్ని బయటపెట్టవద్దంటూ.ఆమెకి మనీ ఇచ్చిన అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు.

ఆ కేసు తాజాగా ఆయన అరెస్టుకి దారి తీయడం ఓ రాజకీయమని ఆయన తరుపు వారు వాదిస్తున్నారు.అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న ట్రంప్.

అరెస్టు తర్వాత విచారణను ఎదుర్కొన్నారు.ఆయనపై మొత్తం 34 అభియోగాలను జడ్జి చదవగా.

వాటిలో దేనిలోనూ తాను దోషిని కాదని ట్రంప్ తెలపడం కొసమెరుపు.ఇక 2006లో నెవడాలో జరిన సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌‌ దగ్గర పోర్న్‌ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌.

ట్రంప్‌ని కలిసి ఓ టీవీ షోలో పాత్రకు తనను రికమెండ్ చెయ్యాలని కోరగా దాన్ని నెపంగా తీసుకొని ట్రంప్ ఆమెతో రాసక్రీడలు నెరిపాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube