వైవీఎస్ చౌదరి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారా?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి( Director YVS Chowdary ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు క్లాసిక్ సినిమాలను అందించిన వైవీఎస్ చౌదరి ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో కొంతకాలం పాటు సినిమాలకు డేట్ తీసుకున్నారు.

 Do You Know Yvs Chowdary Wife Geetha Once A Heroine Know What Movies She Acted D-TeluguStop.com

అయితే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన రచయితగా, దర్శకుడిగా, ఎగ్జిబిటర్‌గా, ఆడియో కంపెనీ అధినేతగా సత్తా చాటారు.సీనియర్ ఎన్టీఆర్‌పై విపరీతమైన అభిమానం పెంచుకున్న వైవీఎస్ చౌదరి.

Telugu Yvs Chowdary, Geetha, Sindhooram, Tollywood, Yvschowdary-Movie

సినిమాల్లోనే ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ బాట పట్టారు.పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన తర్వాత.1998 లో హీరో నాగార్జున నిర్మాణంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రం ద్వారా డైరెక్టర్ అయ్యారు.ఆ సినిమాకు మంచి అప్లాజ్ రావడంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.

ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సీతారామరాజు,( Sitaramaraju ) యువరాజు,( Yuvaraju ) లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.ఇక వైవీఎస్ చౌదరి సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Telugu Yvs Chowdary, Geetha, Sindhooram, Tollywood, Yvschowdary-Movie

ఆయన సతీమణి పేరు గీత.( Geetha ) ఆమె నాగార్జున నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ నిన్నే పెళ్లాడుతా( Ninne Pelladatha ) సినీమాలో హీరో చెల్లెలుగా నటించారు.ఆ తర్వాత మాస్ మహరాజ నటించిన సింధూరం( Sindhooram ) చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా సందడి చేశారు.ఆ తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలే చేశారు.

నిన్నే పెళ్లాడుతా మూవీ సమయంలో వైవీఎస్ చౌదరి దర్శకత్వ శాఖలో పనిచేసేవారు ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్తా స్నేహం, ఆపై ప్రేమగా మారింది ఇద్దరి కులాలు వేరు అవ్వడంతో పెద్దలు అభ్యంతరం చెప్పినా.

వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube