మీకైనా తెలుసా? కరీనా కొడుకు పూర్తి పేరు ఏంటి? ఆరో తరగతి విద్యార్థులకు షాకింగ్ ప్రశ్న?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో ఒకరిగా నిలవడమే కాకుండా టాప్ హీరోయిన్ గా నిలిచింది.

 Do You Know The Name Of Kareena Son Shocking Question To Sixth Grade Students De-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.

వీరికి తైమూర్ అలీ ఖాన్ పటౌడీ, జహంగీర్ అలీ ఖాన్ పటౌడీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇక పెద్ద కుమారుడు 2016లో జన్మించగా, రెండవ కుమారుడు ఈ ఏడాది పుట్టాడు.

ఇదిలా ఉంటే రెండవ కుమారుడు పేరు గురించి చాలామందికి ఎవరికి తెలియదు.ఎందుకంటే కరీనా తన చిన్న కొడుకు గురించి ఎక్కువగా ఎవరితో పంచుకోలేదు.

ఇదిలా ఉంటే తాజాగా కరీనా కొడుకు గురించి ఏకంగా ఆరో తరగతి విద్యార్థులను ప్రశ్నించారు.ఆ ప్రశ్నలు మామూలుగా కూడా అడగలేదు.

ఏకంగా తాము రాసే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో ఈ ప్రశ్న ఎదురైంది.అదేంటి కరీనా కపూర్ కొడుకు గురించి ప్రశ్న వేసే అంత గొప్పతనం ఏముంది అని అందరికీ ఆలోచన రావచ్చు.

Telugu Bollywood, Kareena Kapoor, Kareena Son, Madhya Pradesh, Saif Ali Khan, Si

మధ్యప్రదేశ్ లో అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు తమ పాఠశాల యాజమాన్యం తమ ప్రశ్నాపత్రంలో.‘ సైఫ్, కరీనా కొడుకు పూర్తి పేరు ఏంటి?’ అని ప్రశ్న వేశారు.దీంతో ప్రశ్నపత్రాన్ని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్న ను చూసి షాక్ అయ్యారు.దీంతో ఆ స్కూల్ కి సంబంధించిన పేరెంట్ టీచర్ అసోసియేషన్ జిల్లా విద్యాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు.

Telugu Bollywood, Kareena Kapoor, Kareena Son, Madhya Pradesh, Saif Ali Khan, Si

దీంతో స్కూల్ కు నోటీసులు కూడా అందాయి.ఇక డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంజీవ్ భాలేరావ్ ఈ విషయం గురించి స్పందించాడు.షోకాజ్ నోటీసు కు స్కూల్ యాజమాన్యం ఇచ్చే సమాధానం పై చర్యలు ఆధారపడి ఉంటాయని, సంతృప్తికరమైన జవాబు రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపాడు.

ఇక అంతేకాకుండా సైఫ్, కరీనా కొడుకు పూర్తి పేరు అని అడిగినప్పుడు పాఠశాల యాజమాన్యం వారికి ఇద్దరు కొడుకులు ఉన్నాడన్న సంగతి మర్చిపోయింది.

ఇక ఈ విషయం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.దీంతో వారు అడిగిన ప్రశ్నను బట్టి ఊహించుకున్నట్లయితే కరీనా రెండో కొడుకు గురించి ప్రశ్న వేశారన్నట్లు అర్థమవుతుంది.

Telugu Bollywood, Kareena Kapoor, Kareena Son, Madhya Pradesh, Saif Ali Khan, Si

మొదట్లో కరీనా దంపతులు తన రెండో కుమారుడు పేరు ‘జెహ్’ అని ప్రకటించారు.కానీ పూర్తి పేరు బయటపడటంతో బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.అంతేకాకుండా తన పెద్ద కొడుకు పేరు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయం గురించి నెట్టింట్లో బాగా చర్చలు జరుగుతున్నాయి.

కరీనా కుమారుడు గురించి విద్యార్థులకు ప్రశ్న వేసే అంత గొప్పతనం అతనిలో ఏముంది అని తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube