బిగ్ బాస్ 7 హోస్ట్ గా నాగార్జున ( Nagarjuna ) కొనసాగుతున్నారు.అయితే ఈయన బిగ్ బాస్ 3 నుండి 7 వరకు పోస్ట్ గా చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ 7 లోనే వరస్ట్ హోస్టుగా నాగార్జున పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ సీజన్లో మాత్రం కాస్త మంచి గుర్తింపే వచ్చింది.ఇక వీకెండ్ లో నాగార్జున వస్తున్నారంటే ఆయన వేసుకునే షర్ట్స్ గురించి,షూ గురించి ప్రతి ఒక్కటి ఇలా నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
అంతేకాకుండా ఈయన వేసుకునే డ్రెస్సులు, షూల ఖరీదు లక్షల్లో ఉంటుంది.అలా వీకెండ్ వచ్చిందంటే నాగార్జున గురించే చర్చలు మొదలవుతాయి.
అయితే గత శనివారం రోజు నాగార్జున రంగురంగుల షర్ట్ వేసుకుని వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ షర్టు ధర లక్షల్లోనే ఉంది.
అలాగే ఈయన శనివారం రోజు తన చేతికి ఒక స్పెషల్ బ్యాండ్ ని ధరించారు.అయితే ఆ బ్యాండ్ స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వార్త వినిపిస్తోంది.
ఇక నాగార్జున చేతికి స్మార్ట్ వాచ్ ధరించారు అని అందరూ అనుకున్నారు.కానీ అది స్మార్ట్ వాచ్ కాదు ఆయన పెట్టుకున్నది ఫిట్నెస్ ట్రాకర్( Fitness Tracker ) ఇక ఈ ఫిట్నెస్ ట్రాక్ ని ఈ మధ్యకాలంలో చాలా మంది క్రీడాకారులతో పాటు సెలబ్రిటీలు కూడా పెట్టుకుంటున్నారు.

ఈ ఫిట్నెస్ ట్రాకర్ వల్ల తమ బాడీ పనితీరు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు.ఈ ఫిట్నెస్ ట్రాకర్ బాడీలోని పల్స్, బిపి, ఒత్తిడి, హార్ట్ బీట్ ( Pulse, BP, Pressure, Heart Beat )వంటి వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది.ఇక ఈ ఫిట్నెస్ ట్రాకర్ ని పెట్టుకున్న వారు మొబైల్ లో ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఫిట్నెస్ ట్రాకర్ ని పెట్టుకొని మొబైల్ లో మన శరీర పనితీరు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు.
ఇక ఈ ఫిట్నెస్ ట్రాకర్ బ్రాండ్ ని బట్టి దాని ఖరీదు ఉంటుంది.

అంతేకాకుండా ఒకసారి డబ్బులు పెట్టి జీవితాంతం వాడుకుంటాం అంటే కుదరదు.దీనికి నెల నెలా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.ఇక ఈ ఫిట్నెస్ ట్రాకర్ ని సంవత్సరం మొత్తం రీఛార్జ్ చేయడానికి దాదాపు 25 వేలకు పైగానే డబ్బులు అవసరం అవుతాయట.
ఇలా నాగార్జున పెట్టుకున్న బ్యాండ్ వెనుక ఇంత పెద్ద కథ ఉంది.