RRR సినిమా విడుదల అయ్యాక అందరం ఆశ్చర్యపోయాం.దర్శకుడి ప్రతిభ మరోమారు మెచ్చుకున్నాం.
ఇక మొన్నటికి మొన్న నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం తో మళ్లి ఆ పాటలకు సంబందించిన విషయాలు బాగా వార్తల్లో నిలిచాయి.ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉందని మళ్లి సంతోషిస్తున్నాము.
అయితే నాటు నాటు సాంగ్ ఇంత పెద్ద హిట్ అయ్యాక ఎవరు ఆలోచించని ఒక విషయం ఏమిటి అంటే ఈ పాట చిత్రీకరణ జరిగిన ప్రదేశం గురించి.
అసలు ఈ పాట ఎక్కడ షూటింగ్ జరుపుకుంది ? ఎలా జరిగింది అనే విషయాలను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొదట ఈ పాట ఉక్రెయిన్ లో చిత్రీకరణ జరుపుకుంది అనే విషయం మనకు తెలుసు.ఇప్పుడు అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కానీ 2020 లో అక్కడ చాల ప్రశాంతమైన వాతావరణం ఉండేది.
ఈ పాటను షూట్ చేసింది ఒక ప్యాలెస్ లో.అది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయినా జెలెన్ స్కీ భవనం. ఉక్రెయిన్ యుద్ధం లో ఇతడు హీరో గా నిలిచాడు.
ఇక ఈ పాలస్ లో షూటింగ్ కోసం జెలెన్ స్కీ ఒప్పుకున్నాడు.అందుకు గల కారణం అతడు ఉక్రేనియా కి ప్రెసిడెంట్ కాక ముందు ఒక బుల్లి తెర ఆర్టిస్ట్ కాబట్టి.ఒక నటుడు కాబట్టి అతడికి సినిమా వారి సమస్యలు తెలుసు కాబట్టి ఇలా ఒక చిత్రం కోసం తన ప్యాలెస్ ని షూటింగ్ నిమిత్తం ఇచ్చేసాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చాల ముఖ్యమైన సన్నివేశాలు ఈ ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకున్నాయి.మొదట 2018 లో ఒకసారి మరియు 2021 లో రెండు సార్లు షూటింగ్ జరుపుకుంది RRR సినిమా.
ఇప్పుడు అక్కడ ఇంకా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఎవరిని లోపలి ప్రవేశించ నివ్వడం లేదు.ఉక్రియన్ లో ఉన్న అత్యంత ముఖ్యమైన చరిత్రకాత్మక ప్రదేశం ఇది.దీనికి చాల ఏళ్ళ చరిత ఉంది.రాజమౌళి ఈ పాలస్ ని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణం బ్రిటిష్ కాలానికి దగ్గరగా ఉండే ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్.
బయట దేశాల్లో ఇంత కన్నా మంచి భవనాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలెస్ అయితేనే బాగుంటుంది అని, సెట్ కూడా వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పెర్మిషన్ తీసుకోం మరి షూటింగ్ పూర్తి చేసారు.