పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే రూ.లక్ష ఇలా విత్‌డ్రా చేసుకోండి..!

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా… అయితే ఈ న్యూస్ మీకోసమే! సాధారణంగా పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలి అని చాలామంది అనుకుంటారు.కానీ అది ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నారు.అయితే కొన్ని రూల్స్ ప్రకారం మీరు రూ.1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.మీరు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బులను గంటల్లోనే విత్‌డ్రా చేసుకోవడానికి పీఎఫ్ సంస్థ అనుమతిస్తుంది.ఇందుకు మీరు ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చును, ఆసుపత్రి అడ్మిట్ ప్రూఫ్ లను చూపించాల్సి ఉంటుంది.

 Do You Have A Pf Account But Withdraw Rs. 1 Lakh Like This, Pf Account, Latest-TeluguStop.com

మెడికల్ అడ్వాన్స్ అమౌంట్ కింద ఉద్యోగులు ఒక లక్ష రూపాయల వరకూ నగదును విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీ ని కల్పిస్తున్నట్లు తాజాగా ఈపీఎఫ్ఓ ప్రకటించింది.కోవిడ్-19తో సహా ఇతర మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూడా మీరు పీఎఫ్ ఖాతా నుంచి మనీ ని తీసుకోవచ్చు.వాస్తవానికి గతంలో కూడా మెడికల్ ఎమర్జెన్సీ కింద డబ్బులు డ్రా చేసేందుకు అనుమతి ఉండేది.కాకపోతే ఆస్పత్రిలో చేరి బిల్లులన్నీ చెల్లించి వాటిని ప్రూఫ్ గా చూపించిన తర్వాతనే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా అయ్యేవి.

అయితే ఇప్పుడు మీరు ముందస్తుగా బిల్లులు చెల్లించాల్సిన పని లేదు.ఆస్పత్రిలో చేరి మీ అడ్మిట్ కు సంబంధించిన ప్రూఫ్ చూపిస్తే చాలు వెంటనే మీ అకౌంట్ కు మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

అర్జెంట్‌గా ఒక రూ.లక్ష మనీ ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మీరు www.epfindia.gov.in వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.

తరువాత కోవిడ్ 19 ట్యాబ్ ఆప్షన్ లోని ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లయిమ్ పై క్లిక్ చేయండి.ఆపై https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface లోకి వెళ్లి తర్వాతి సూచనలను అనుసరించండి.దీంతో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది.

అది ఏంటంటే మీ ఆధార్ మొబైల్ నంబర్ తో లింక్ అయి ఉండాలి.ఆ నంబర్ కు మాత్రమే ఓటీపీ వస్తుంది.

Do You Have A PF Account But Withdraw Rs. 1 Lakh Like This

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube