సమాజంలో చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఆస్తి విషయంలో ఎంత దగ్గర వారైనా సరే గొడవలు పడుతూ ఉంటారు.అయితే ఇది కేవలం మామూలు మధ్యతరగతి కుటుంబాల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి.
ఇక సెలబ్రిటీల విషయంలో కూడా ఇది కామనే.అయితే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కి తన అన్న అక్కినేని వెంకట్ కి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయని,ఇద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవు అంటూ ఎప్పటినుండో ఒక వార్త నెట్టింట చక్కెర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
అయితే చాలామంది అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageshwar rao ) కి నాగార్జున ఒక్కడే కొడుకు అని అనుకుంటారు.ఇక నాగార్జున సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఈయనే అందరికీ తెలుసు.
కానీ నాగార్జునకు వెంకట్ అనే అన్నయ్య కూడా ఉన్నారు.ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా వీరి మధ్య మాటల్లేవని,ఆస్తి విషయంలో గొడవలు పడ్డారని ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయంపై అక్కినేని వెంకట్ ( Akkineni Venkat ) రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.మా నాన్నగారి ముందు మేము ఏ రోజు కూడా మాట మాట్లాడే వాళ్ళం కాదు.ఏదైనా మాట్లాడితే చాలా భయపడే వాళ్ళం.
ఇక మా ఇద్దరినీ నాన్న ఇండస్ట్రీకి దూరంగా పెంచారు.కానీ నేనే ఒకరోజు నాన్న దగ్గరికి భయపడుతూనే వెళ్లి నాన్న నాగార్జునని హీరో చేద్దాం అని అన్నాను.
దానికి నాన్న కూడాఏం మాట్లాడకుండా ఒప్పుకున్నారు.ఇక నాగార్జునకి నాకు మధ్య గొడవలు వచ్చాయి, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ( Annapurna studios ) బాధ్యతలు అన్నీ కూడా నాగార్జుననే చూసుకుంటారు.అంటూ అక్కినేని వెంకట్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు జనరేషన్ గ్యాప్ వస్తుంది అని ఉద్దేశంతోనే నేను సినిమాలు నిర్మించడం మానేశాను అంటూ చెప్పుకొచ్చారు.దీంతో గత కొద్ది రోజులుగా అక్కినేని నాగార్జున వెంకట్ మధ్య మాటలు లేవు అనే ప్రచారానికి పులిస్టాప్ పడినట్లు అయింది.