తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారిలో దర్శకుడు తేజ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
ఈయన మనసులో ఏదైనా అనుకుంటే ముఖం మీదే చెప్పేస్తూ ఉంటాడు.అంతేకాకుండా అనవసరంగా ఇటువంటి విషయాలలో కూడా కలుగజేస్తారు.
తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.ఒకరిపై ఒకరు విమర్శలు చేయడు.
తనపై ఎవరైన విమర్శలు చేసినా కూడా పట్టించుకోడు.ఇక మీడియాలో అయితే అసలు కనిపించరు.
తన సినిమా విడుదల అవుతుంది అంటే ఏదైనా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కనిపిస్తాడు తప్పితే డైరెక్టర్ తేజ ఎక్కువగా మీడియా ముందు కానీ మైక్ ముందు కానీ కనిపించరు.
అంతే కాకుండా వ్యక్తిగత ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు.
అంతేకాకుండా సదరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తనకు బాగా తెలిసిన వ్యక్తి అయితేనే కొంచెం ఫ్రీగా మాట్లాడగలను అని లేకపోతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అని చెప్పేస్తారు.అంతేకాకుండా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకటే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.
ఇక తేజలోని కొన్ని లక్షణాలు తన గురువు రామ్ గోపాల్ వర్మకి దగ్గరగాను ఉంటాయి అనిపిస్తుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
ఇండస్ర్టీ కల్చర్ కి ఎందుకు దూరంగా ఉంటారు? సినిమా ఫంక్షన్స్ లో కనిపించరు? సక్సెస్ పార్టీలకు హాజరవ్వరు? ఇవన్నీ మీ క్యారెక్టర్ లో భాగమా? అన్న ప్రశ్నలు ఎదురుగా కాగా ఆ ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు తేజ.

సదరు యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.పార్టీకి వెళ్తే బోర్ కొడుతుంది.నేను తాగను.
సిగరెట్టు కాల్చను. సరిగ్గా తినను.
మీరంతా ఫుడ్డీ కాదు.అమ్మాయిలు కోసం వెళ్లాలనిపించదు.
సినిమా అంటేనే ఇంట్రెస్ట్.పార్టీకి వెళ్లినా.
సినిమా ఫంక్షన్లకు వెళ్లినా వీటన్నింటికి మించి మరో పెద్ద సమస్య ఉందండోయ్.ఆహ్వానించిన వారికి అక్కడ భజన చేయాలి.
మనకి ఇష్టం లేకపోయినా నవ్వాలి.ఆయన గ్రేట్.
ఈయన గ్రేట్ అంటూ పొగడాలి.వాళ్లు ఎవరో మనకి పూర్తిగా తెలియకపోయినా అలా మాట్లాడాల్సి వస్తుంది.
మనది కాదు అన్న దానికి వెళ్తే.ఇవన్నీ చేయాలి.
అవసరమా మనకిదంతా? నాపని నేను చేసుకుంటా…నా తంటాలు నావి.ఉదయం లేచిన దగ్గర నుంచి నా గోల నాదిగానే ఉంటాను అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు దర్శకుడు తేజ.తేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.