పూరి జగన్నాథ్ తీసిన ఈ సినిమాలో.. అందమైన హీరోయిన్ల కంటే సైడ్ క్యారెక్టర్లే హైలెట్ అయ్యాయి తెలుసా?

సాధారణంగా హీరోల తరువాత కథను నడిపించేది ఎవరు అంటే హీరోయిన్ పాత్ర అనే విషయం తెలిసిందే.అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కేవలం గ్లామర్ ఒలకబోస్తు ఉంటే మరికొన్ని సినిమాలలో కథను ముందుకు నడిపించేదిగా ఉంటుంది.

 Director Puri Actors Craze , Amma Nanna O Tamila Ammayi, Raviteja, Jaya Sudha, L-TeluguStop.com

అయితే ఇక హీరోయిన్ పాత్ర ఎలా ఉన్నా ఇక సినిమా మొత్తానికి హీరోయిన్ హైలైట్ అయ్యేలా దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతూ ఉంటారు.కానీ కొన్నిసార్లు మాత్రం హీరోయిన్ పాత్రలకు మించి సైడ్ క్యారెక్టర్ హైలెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాలో ఇప్పటి వరకు చాలా సార్లు ఇలా జరిగింది.మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి :

ఈ సినిమాలో ఎంతో అమాయకురాలైన ఆడపిల్ల పాత్రలో నటిస్తోంది ఆసిన్.అయితే ఆసీన్ చేసిన పాత్ర కంటే రవితేజ తల్లిగా జయసుధ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

Telugu Ammananna, Desa Muduru, Puri, Golimaar, Gopi Chand, Jaya Sudha, Kovai Sar

కెమెరామెన్ గంగతో రాంబాబు :

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది.కానీ తమన్నా క్యారెక్టర్ కంటే గుండక్క అనే ఒక పొలిటీషియన్ పాత్రలో నటించిన శృతి హైలెట్ గా మారింది అని చెప్పాలి.సినిమా పేరు చెబితే చాలు శృతి చేసిన కామెడీ గుర్తుకు వస్తూ ఉంటుంది.

గోలీమార్:

గోపీచంద్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి పాత్ర కంటే ప్రియమణి తల్లి పాత్రలో నటించిన రోజా బాగా హైలెట్ అయింది అని చెప్పాలి.

దేశముదురు :

దేశముదురు పేరు తీయగానే ముందుగా అల్లు అర్జున్ గుర్తుకువస్తాడు.ఇక ఆ తర్వాత బాగా ప్రేక్షకులకు ఆకట్టుకున్న శివాని కారెక్టర్ గుర్తుకువస్తుంది.

ఇక ఈ పాత్ర పోషించింది లేడీ కమెడియన్ కోవై సరళ అని చెప్పాలి.మొత్తం సినిమాలో కోవైసరళ కనిపించినంత సేపు ప్రేక్షకులను ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

ఇలా హీరోయిన్ హన్సిక కంటే కోవై సరళ బాగా హైలెట్ అయ్యింది.

Telugu Ammananna, Desa Muduru, Puri, Golimaar, Gopi Chand, Jaya Sudha, Kovai Sar

లోఫర్ :

లోఫర్ సినిమాలో దిశాపటాని ఎంతలా అందాలు ఆరబోసినప్పటికీ అటు హీరో తల్లి పాత్రలో నటించిన రేవతి సినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.అంతే కాదు సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.

Telugu Ammananna, Desa Muduru, Puri, Golimaar, Gopi Chand, Jaya Sudha, Kovai Sar

లైగర్ :

మరికొన్ని రోజుల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా రాబోతుంది.ఈ సినిమాలో కూడా రమ్య కృష్ణ హైలెట్ అవుతుందని తెలుస్తుంది.ఇప్పటికే చూసిన ట్రైలర్ లో రమ్యకృష్ణకు పవర్ ఫుల్ డైలాగ్ లు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube