సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నిలతొక్కుకోవాలి అంటే అంత సులభమైన పని కాదు.ఇండస్ట్రీలో అవకాశాలను వెతుక్కోవడం సరైన స్థాయిలో ఉపయోగించుకొని ఇండస్ట్రీలో కొనసాగడం మరో ఎత్తు అని చెప్పాలి.
ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తుంటాయి.అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే కనుక ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పాలి.
ఇలా ఎంతోమంది అష్ట కష్టాలు పడుతూ ఇండస్ట్రీలో ఓ గొప్ప స్థాయిలో ఉన్నారు అలాంటి వారిలో డైరెక్టర్ మారుతి ( Director Maruthi ) ఒకరు.
రెండు రూపాయల జిలేబి తిని కడుపు నింపుకున్నటువంటి మారుతి రోడ్లపై అరటిపండ్లు అమ్ముతూ ఇప్పుడు అదే రోడ్డుపై ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నారు.ఇలా దర్శకుడిగా రచయితగా నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మారుతి ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి తన భార్య వీనరాగా స్పందన ( Veenaraga Spandana ) తో కలిసి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి మధ్య కొనసాగిన ప్రేమ ప్రయాణం గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా మారుతి భార్య స్పందన మాట్లాడుతూ తాను స్కూల్ నుంచి తనకు పరిచయమని మారుతీ తన సీనియర్ అని తెలియజేశారు.ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తన మొహం నాకు నచ్చింది.
తొమ్మిదవ తరగతిలో తన టాలెంట్ నచ్చిందని తెలియజేశారు.పదో తరగతి పూర్తి అయిన తర్వాత కూడా మా ప్రేమ అలాగే కొనసాగుతూ వచ్చిందని నాకోసం తను ఆర్టీసీ బస్సు( RTC Bus )లో వచ్చేవాడని నేను స్కూటీ పై వెళ్లే దాన్ని.
ఇలా ఇద్దరం కలిసి స్కూటీ పై చక్కర్లు కొడుతూ బాగా ఎంజాయ్ చేశామని తెలిపారు.ఇక మారుతి మాట్లాడుతూ స్పందనకు డైరీ రాసే అలవాటు ఉంది నేను తనని ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నాను అనే విషయాలన్నింటినీ కూడా డైరీలో రాస్తుంటారు.
పెళ్లికాకముందు స్పందనను కలుసుకోవడానికి నేను వేసిన చిల్లర వేషాలు వెధవ వేషాలు అన్నీ కూడా ఆ డైరీలోనే ఉంటాయి అంటూ ఈ సందర్భంగా మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.