Director Selva Raghavan: నేను చనిపోలేదు.. జస్ట్ బ్రేక్ తీసుకున్నానంతే.. ప్రముఖ తమిళ దర్శకుడు కామెంట్స్ వైరల్?

ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు అయినా సెల్వ రాఘవన్( Director Selva Raghavan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడు గాని కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సెల్వ రాఘవన్.

 Selvaraghavan Iam Not Died Or Retired-TeluguStop.com

కాగా మొదట తుళ్లువదో ఇలమై సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ ను ప్రారంభించారు సెల్వ రాఘవన్.ఈ సినిమాలో సెల్వ రాఘవన్ సొంత సోదరుడు నటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మళ్లీ ధనుష్ ను( Dhanush ) హీరోగా పెట్టి కాదల్ కొండై సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.మొదటి రెండు సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సెల్వ రాఘవన్ ఆ తర్వాత వరుసగా ప్రేమకథలు తీసుకుంటూ దూసుకుపోయారు.ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

తర్వాత నటన రంగంలోకి అడుగుపెట్టిన సెల్వ రాఘవన్ దర్శకుడిగానే( Director ) కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు.తాజాగా ఒక నెటిజన్ సెల్వ రాఘవన్ గురించి పొగుడుతూనే ఆయన లేరు అన్న ట్విట్ చేసాడు.

అంతేకాకుండా ఆయన సినిమాలు తీయడం ఆపేసినట్లు ఉన్నారు లేదంటే చనిపోయారేమో అంటూ ట్వీట్ చేశాడు.

సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై సెల్వ రాఘవన్ కాస్త ఘాటుగా స్పందించారు.ఎందుకు అలా అన్నావు మిత్రమా.నేను ఇంకా చనిపోలేదు.

అలా అని సినిమాలు తీయడం కూడా ఆపలేదు.ఏదో నాకోసం నేను కొంత సమయాన్ని తీసుకుంటూ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాను అంతే.

నేను ఇంకా 40 లోనే ఉన్నాను త్వరలోనే మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను అంటూ ట్వీట్ చేశాడు.సెల్వ రాఘవన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube