డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Director Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ హీరో విజయ్ (Vijay) నటించినటువంటి చిత్రం లియో ( Leo ). దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మిశ్రమ స్పందన లభించుకుంది.లోకేష్ ఇదివరకు నటించిన విక్రమ్ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో లియో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయి.ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ దసరా పండుగ కావడంతో ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ కూడా రాబడుతుంది.
లియో సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ఆ అంచనాలను చేరుకోలేక పోవడమే కాకుండా సినిమా పట్ల నెగిటివ్ కామెంట్స్( Negative Comments ) కూడా రావడంతో ఇప్పటివరకు చిత్రబంధం స్పందించలేదు.ఇక ఈ సినిమా విడుదలైన క్షణం నుంచి డైరెక్టర్ లోకేష్ పూర్తిగా మీడియాకు దూరంగా ఉన్నారు.ఇలా మీడియాకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ సినిమా గురించి వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్లపై స్పందిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ.లియో సినిమాని జనాలు బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.తాను నెట్వర్క్ కవరేజ్ ఏరియాకు దూరంగా ఉన్నానని మరొక నాలుగైదు రోజులలో తాను ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతానని తెలియజేశారు.
ఈ సినిమా పట్ల ఆడియన్స్ రెస్పాన్స్( Audience Response ) ఏంటి అనే విషయాన్ని తాను తెలుసుకొని, వారి అభిప్రాయాలు బట్టి నా తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి మార్పులు చేయాలి ఏంటి అనే విషయాల గురించి ఆలోచిస్తానని తెలిపారు.ప్రస్తుతానికైతే తాను ఏ విధమైనటువంటి రివ్యూలను తెలుసుకోలేదు అంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.