ఆర్య 2లో లోబో నటించాడన్న విషయం మీకు తెలుసా?

లోబో ఒకప్పుడు స్టార్ మాలో మా మ్యూజిక్ లో లోబో యాంకర్ గా పని చేశారు.అలా తన యాంకరింగ్ ద్వారా అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న లోబో తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హౌస్ లోకి అడుగుపెట్టి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు.

 Did You Know That Lobo Acted In Arya 2 Movie Details, Bigg Boss 5, Telugu, Lobo-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిన లోబో ప్రస్తుతం కామెడీ స్టార్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.అయితే లోబో గురించి ప్రస్తుతం ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య 2 సినిమాలో లోబో నటించారు.అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.ఒకవేళ ఆ పాత్ర ఇప్పటికీ చూసినా కానీ అందులో ఉన్నది లోగో అని మాత్రం ఎవరు గ్రహించలేరు.ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ లోబో ఎంతో మారిపోయాడు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో అందరూ లోబో ఏ సీన్లో నటించారు అంటూ ఆరా తీస్తున్నారు.మరి లోబో ఆర్య 2 సినిమాలో ఏ సీన్ లో నటించారు అనే విషయానికి వస్తే…

Telugu Arya, Bigg Boss, Bigg Boss Lobo, Brahmanandam, Sukumar, Geeta, Lobo, Lobo

అల్లు అర్జున్ బ్రహ్మానందం మధ్య ఎన్నో కామెడీ సన్నివేశాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే ఆర్య తనకు లవ్ లెటర్ రాశారనీ గీత వెళ్లి బ్రహ్మానందంకి చెబితే ఆ సమయంలో బ్రహ్మానందం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి గీతకు నువ్వు ఐ లవ్ యూ అని రాశావా అని అడుగుతారు.అప్పుడు ఆర్య ఏంటి సార్ అంటూ ఉండగా వీరిద్దరి మధ్య జరిగే ఈ సన్నివేశం వెనుక లోబో ఉంటాడు.

Telugu Arya, Bigg Boss, Bigg Boss Lobo, Brahmanandam, Sukumar, Geeta, Lobo, Lobo

అయితే ఆ సన్నివేశం మనం ఇప్పుడు చూసిన వెంటనే అక్కడ ఉన్నది లోబో అని గ్రహించలేము.అప్పట్లో జనాలకు లోబో పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల అతని పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదని కూడా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube