సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఎంతోమంది హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి వారిలో కావ్య కళ్యాణ్ రామ్( Kavya Kalyan Ram ) ఒకరు.
ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి సినిమాలో నటించారు.అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో కూడా నటించి సందడి చేశారు.
ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ మసూద్ సినిమా( Masooda Movie ) ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇక తాజాగా వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం( Balgam ) సినిమా ద్వారా ఈమె మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాలో ప్రియదర్శికి జోడిగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ వంటి వారి సినిమాలలోనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన సినిమాలో కూడా నటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కావ్య ఈ విషయాన్ని తెలియజేశారు.తాను మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించానని తెలిపారు వివి వినాయక్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఠాగూర్ సినిమా ( Tagore Movie ) ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమాలో చిరంజీవి కొంతమంది పిల్లలకు ఆశ్రయం ఇస్తూ ఉంటారు.

వారిలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకరిగా నటించారు అయితే తాజాగా చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తుపడతారేమో అనుకున్నాను సార్ నేను మీరు నటించిన ఠాగూర్ సినిమాలో నటించానని చెబుతుండగానే పిల్లి కళ్ళు అంటూ తనని గుర్తుపట్టారని కావ్య వెల్లడించారు.అప్పుడే ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా మిమ్మల్ని చూస్తుంటే మాకు వయసు అయిపోయిందనిపిస్తుంది అంటూ చిరంజీవి గారు చెప్పారని ఈ సందర్భంగా కావ్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.