తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న డైరెక్టర్ అట్లే.రీసెంట్ గా ఈయన డైరెక్షన్ లో బాలీవుడ్ బాద్ షా అయిన షారుక్ ఖాన్ ( Shah Rukh Khan )హీరోగా జవాన్ సినిమా ( Jawan movie )వచ్చింది.
ఇక రీసెంట్ గాఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు దాదాపు గా 700 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టింది… ఇక దాంతో ప్రస్తుతం నెట్ ఫ్లెక్స్ వారు ఈ సినిమాని ఓటిటి రైట్స్ కింద 250 కోట్లు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది.ఇక షారుక్ ఖాన్ కెరియర్ లో ఇప్పటివరకు ఈ సినిమానే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఆయన ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ సినిమా ఏం చేయాలనే దానిమీద ఆలోచన చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ప్రతి సినిమాతో అట్లీ ( Atlee Kumar )తన మార్కెట్ ని పెంచుకుంటూపోతున్నాడు అట్లీ తీసిన సినిమాలు రొటీన్ గా ఉన్నప్పటికీ అవి మంచి విజయాలను అందుకుంటున్నాయి.నిజానికి అట్లీ షారుక్ ఖాన్ తో సినిమా చేయాలనేది ఆయన కల…అది జవాన్ సినిమాతో( Jawan movie ) నెరవేరింది.ఈ సినిమాతో షారుఖాన్ కి ఒక అదిరిపోయే హిట్టు కూడా ఇచ్చాడు.
ఇక అట్లీ నెక్స్ట్ ఏ హీరో చేయబోతున్నాడు అనే దానిమీద చర్చ జరుగుతుంది.
ఇక ఇది ఇలా ఉంటే జవాన్ నెట్ ఫ్లెక్స్ లో రిలీజ్ అవుతున్న కొద్దీ దానికి సంభందించిన మరో కొత్త అప్డేట్ కూడా వచ్చేసింది అది ఏంటి అంటే ఈమధ్య అట్లీ మాట్లాడుతూ జావాన్( Jawan movie ) ఓటిటి రిలీజ్ లో థియేటర్ కోసం కట్ చేసిన 20 నిమిషాల ఎపిసోడ్ ని కూడా ఆడ్ చేసి ఈ సినిమాని ఓటిటి లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా చెప్పాడు… ఇక ప్రేక్షకులు కట్ చేసిన 20 నిమిషాలు కూడా ఓటిటి లో చూడవచ్చు ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం నెట్ ఫ్లెక్స్ 250 కోట్లు పెట్టినట్టు గా తెలుస్తుంది.ఈ సినిమా థియేటర్లో సూపర్ సక్సెస్ అయింది.మరి ఓటీటి లో కూడా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…
.