కోలీవుడ్ హీరో ధనుష్ ( Dhanush ) పేరుకే తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో ఎంతోమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు.ఈయన చేసిన సినిమాలు చాలావరకు తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
అలా సౌత్ లో మంచి ఇమేజ్ ఉన్న స్టార్ గా ధనుష్ పేరు తెచ్చుకున్నారు.ఇక చూడడానికి అంతగా హీరో మెటీరియల్ లా కనిపించకపోయినప్పటికీ ఈయన తన సినిమాల ద్వారా ఎంతో మంచి కంటెంట్ ని సమాజానికి అందిస్తారు.
అలాంటి ధనుష్ సార్ ( Sir ) అనే మూవీ తో తెలుగులో మొదటిసారి డైరెక్ట్ మూవీ చేశారు.
అలా ఈయన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇక ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న ధనుష్ తన కొడుకు కారణంగా తలదించుకునే పరిస్థితి ఎదురైందట.ఇక అసలు విషయం ఏమిటంటే.
ధనుష్ రజనీకాంత్ ( Rajinikanth ) కూతురు సౌందర్యను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే దాదాపు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్నారు.
అలా వీరిద్దరికీ యాత్ర,లింగా( Yatra, Linga ) అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.ఇక పెద్ద కొడుకు యాత్ర తాజాగా స్పోర్ట్స్ బైక్ నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
15 ఏళ్ల వయసున్న యాత్ర ( Yatra ) డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాకుండానే తాము ఉంటున్న పోయిస్ గార్డెన్ ఏరియాలో స్పోర్ట్స్ బైక్ నడిపాడు.అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆ వీడియో చూసిన పోలీసులు అసలు అక్కడ ఉన్నది ధనుష్ కొడుకా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకొని అది ధనుష్ కొడుకు అని తెలిసి ధనుష్ ఇంటికి వెళ్లి మరీ వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.అలా కొడుకు కారణంగా ధనుష్ 1000 రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది.