ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఆప్ నేత దీపక్ సింఘ్లా( Deepak singla ) నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తుంది.
సింఘ్లా ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party)లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గోవాకు ఆప్ ఇంఛార్జ్ గా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కో -ఇంఛార్జ్ గా సింఘ్లా విధులు నిర్వహిస్తున్నారు.కాగా ఈ నెల 23న ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ను ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.