కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే సాగునీటి మంత్రులుగా ఉన్నారని చెప్పారు.
ప్రజలను మభ్య పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.అలాగే లీడర్లు కాదు రీడర్లు అంటూ మాట్లాడారని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు కార్పొరేషన్ల ద్వారా రూ.97,449 కోట్ల లోన్లకు అనుమతులు తీసుకున్నారన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.79,287 కోట్ల లోను విడుదల అయిందని తెలిపారు.కాళేశ్వరం అప్పులు తీసుకునేటప్పుడు పరిశ్రమలకు, వ్యవసాయానికి అన్ని అవసరాలకు నీటిని అమ్ముతామని చెప్పారని పేర్కొన్నారు.దాని వలన సంవత్సరానికి రూ.5,199 కోట్లు వస్తాయని చెప్పారని తెలిపారు.మిషన్ భగీరథ ద్వారా రూ.5,706 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి తప్పుడు నివేదికలతో ఆర్థిక సంస్థలను మోసం చేసి రుణాలు తెచ్చుకున్నారని ఆరోపించారు.