రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమకు ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు సీరియల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి రాజమౌళి( Rajamouli ) ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు.
అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళికి అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి.ఇలా ఇప్పటివరకు ఈయన 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఈ 12 సినిమాల ద్వారా కూడా ఈయన ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకోవడంతో ఈయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది.
రాజమౌళి దర్శకత్వ ప్రతిభ చూసి హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈయన సినిమాని తెరకెక్కించే విధానం చూసి హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈయన సినిమాలకు పని చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అపజయం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
రాజమౌళి ఏదైనా ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు అంటే ఆగే ప్రసక్తే లేదు ఎంత బడ్జెట్ అయినా కూడా దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు కూడా వెనకాడటం లేదు.
ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈయన కెరియర్ లో కూడా ఒక సినిమా విడుదలకు నోచుకోకుండా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తోంది.ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిసి ఎంతో మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.మరి ఈయన డైరెక్షన్లో ఆగిపోయినటువంటి ఆ సినిమా ఏంటి ఆ సినిమాలో హీరోగా ఎవరు నటించారు ఎందుకు ఈ సినిమా ఆగిపోయిందనే విషయానికి వస్తే…
రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని ఎక్కించిన తర్వాత సినిమాని హీరో మోహన్ లాల్(Mohanlal) తో చేయాల్సి వచ్చింది అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చర్చలలోనే ఆగిపోయింది.ఈ సినిమా ఆగిపోవడంతో రాజమౌళి తన తదుపరి సినిమాని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు (Raghavendra Rao) కుమారుడు సూర్య ప్రకాష్ (Surya Prakash)తో కలిసి ఒక సినిమా చేయాలని భావించారు.
ఇక సూర్య ప్రకాష్ తో సినిమా మొదలు పెట్టినటువంటి రాజమౌళి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేక మధ్యలోనే ఆగిపోయింది.ఇక నిర్మాత ధైర్యం చేసి ముందుకు వెళ్దాము అంటే అప్పటికే సూర్య ప్రకాష్ నటించిన సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతోనే రాజమౌళి అలాగే నిర్మాతలు ఈ సినిమాని ముందుకు నడిపించే విషయంలో విఫలమయ్యారని దీంతో ఈ సినిమా అక్కడికి ఆగిపోయిందని తెలుస్తుంది.