ప్రస్తుత కరోనా వైరస్ కాలం నడుస్తుంది.చైనాలో పుట్టిన ఈ వైరస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటి పది లక్షలమంది కరోనా బారిన పడ్డారు.ఇంకా అందులో 5లక్షలమందికిపైగా కరోనా కారణంగా మృతి చెందారు.
ఇంకా దీని వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందా అని చూస్తున్నారు.
రోజు రోజుకు భారీస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.అయితే మన చుట్టుపక్కల వారు అనారోగ్యంతో బాధపడితే అప్పట్లో మనం వారికీ సహాయం చేసావాళ్ళం.
కానీ ఇప్పుడు అలాంటి వారు మన చుట్టుపక్కల ఉంటే ఎక్కడ కరోనా వైరస్ ఉందో అని బెదిరిపోతున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ విషయం బయట పడింది.
కరోనా వైరస్ తో మరణించిన వారి మృతదేహాలలో 6 గంటల తర్వాత వైరస్ ఉండదని స్పష్టం చేశారు.కరోనా వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ఇబ్బందులు కలుగు చేయవద్దని ప్రజలకు సూచించారు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి.
.