గత కొన్ని రోజులుగా పవన్ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఓ ముఠాను పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది పట్టుకున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి .ఈ ముఠాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ప్రైమ్ 9 ఛానెల్‌లో ఈ సంఘటనకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్తా ప్రసారమైంది.ఈ ఘటన సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలను సదరు ఛానల్ వెల్లడించింది.
ప్రైమ్ 9 ప్రసారం చేసిన వార్త ప్రకారం, ఆ ముఠాకు 250 కోట్ల రూపాయల సుపారీ చెల్లించి పవన్‌ను హత్య చేయమన్నట్లుగా కొందరూ పెద్దలు చెప్పినట్లుగా తెలిపింది.హత్యకు సంబంధించిన సుపారీపై కేంద్ర విజిలెన్స్ ఏజెన్సీకి సవివరమైన నివేదిక ఉందని ఛానెల్ పేర్కొంది.2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ హత్యకు స్కెచ్ వేశారని కూడా చెప్పుకుంటున్నారు.మెుదటిగా ఆగస్టు 19వ తేదీన పవన్ కళ్యాణ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారని.
అది కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదని తెలింది.బెంగళూరు, చెన్నైలలో ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయని కథనంలో పెర్కొంది.
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ వార్తను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.పవన్ భద్రతపై ఆందోళన చెందుతున్న వారు పవన్‌కు భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖను కోరుతున్నారు.
అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉన్నదనేది స్పష్టత లేదు.అయితే ఈ డీల్ వెనుక ఎవరున్నారు? సుపారీ ఎవరికి ఇచ్చారు? ఎవరి నుంచి డబ్బులు చేతులు మారాయి? అనే దానిపై ఈ కథనంలో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.అలాగే కేంద్ర నిఘా వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ కు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన విషయం బయటకు రాలేదు కాబట్టి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారని మా వర్గాల తెలిపాయి.మేలో ఒక చిన్న షెడ్యూల్‌ని ముగించిన పవన్ ఐదు నెలల తర్వాత హరి హర వీరమల్లు సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు.భారీ బ్రేక్‌లు లేకుండా పవన్ ఈ సినిమా షూటింగ్‌లో నిరంతరం పాల్గొంటాడని, మరో మూడు నెలల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆసక్తితో పవన్ ఉన్నాడని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.