ఓ భారతీయ వ్యక్తి కోసం ఆస్ట్రేలియా పోలీసులు నాలుగేళ్లుగా వేట సాగిస్తున్నారు.అతడిని పట్టిచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వారికి రూ.5 కోట్ల రివార్డు ప్రకటించారు.2018లో క్వీన్స్‌లాండ్‌లోని బీచ్‌లో 24 ఏళ్ల యువతిని హత్య చేసి భారత్‌కు ఓ వ్యక్తి పారిపోయాడు.అతడు అక్కడ నర్సుగా పని చేసేవాడు.అతడి గురించి ఎలాంటి సమాచారం అందించినా ఆస్ట్రేలియన్ పోలీసులు రికార్డు స్థాయిలో ఒక మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించారు.క్వీన్స్‌లాండ్‌లోని కైర్న్స్‌కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాంగెట్టి బీచ్‌లో తోయా కార్డింగ్లీ తన కుక్కతో నడుచుకుంటూ వెళుతుండగా, ఆమె అక్టోబర్ 21, 2018న చంపబడిందని క్వీన్స్‌లాండ్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఇన్నిస్‌ఫైల్‌లో నర్సుగా పనిచేసిన రాజ్‌విందర్ సింగ్ (38) ఈ కేసులో కీలక వ్యక్తి అని, అయితే కార్డింగ్‌లీ హత్యకు గురైన రెండు రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి దేశం విడిచి పారిపోయాడని ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పుడు క్వీన్స్‌లాండ్ పోలీసులు అందించిన అతిపెద్ద 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్‌లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.5 కోట్లను రివార్డుగా ప్రకటించారు.తోయా హత్యకు గురైన మరుసటి రోజు అక్టోబర్ 22న సింగ్ కైర్న్స్ నుండి బయలుదేరి 23వ తేదీన సిడ్నీ నుండి భారతదేశానికి వెళ్లాడని తమకు సమాచారం అందిందని వెల్లడించారు.

సింగ్ పంజాబ్‌లోని బుట్టర్ కలాన్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.సింగ్ కోసం చివరిగా తెలిసిన ప్రదేశం భారత్ అని ధ్రువీకరించుకున్నట్లు పేర్కొన్నారు.కైర్న్స్‌లో దర్యాప్తు కేంద్రం కూడా ఏర్పాటు చేయబడిందని, రాష్ట్రవ్యాప్తంగా హిందీ, పంజాబీ రెండూ మాట్లాడగల పోలీసు అధికారులను రప్పించారని ప్రకటనలో వారు వివరించారు.
ఆస్ట్రేలియా, విదేశాలలో రాజ్‌విందర్ సింగ్ ఆచూకీ గురించి సమాచారాన్ని పంచుకునే వ్యక్తులు ఉన్నారని గట్టిగా నమ్ముతున్నామని వారు చెప్పారు.ఆ వ్యక్తి చాలా ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని, హత్య చేయడాన్ని తాము సహించబోమని తెలిపారు.
ప్రజలు ఆ నిందితుడిని పట్టివ్వాలని కోరారు.