సంఖ్యాపరంగా దేశంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయ రంగంలో మాత్రం బీసీలకు( BC ) సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.అయితే రాష్ట్ర రాజకీయాలను అగ్రవర్ణాలు ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంఘటితంగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు కూడా బీసీ వర్గాల నుంచి కనిపించడం లేదన్నది ప్రధాన విశ్లేషణ.
ముఖ్యంగా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం అధికారం కోసం పోటీపడుతూ ఉన్నాయి
దశాబ్దాలు పాటు పరిపాలించిన కాంగ్రెస్ లో( Congress Party ) రెడ్డి నేతలు ముఖ్యంగాచక్రం తిప్పేవారు .కాంగ్రెస్ కి వారు కీలక వోటుబ్యాంక్ గా ఉండేవారు .అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్( KCR ) గత రెండు పర్యాయాలుగా అధికారాన్ని శాసిస్తున్నారు.అయితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి బీసీ మంత్రాన్ని పటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ దిశగా కాంగ్రెస్ హై కమాండ్ చేసిన సర్వేలో బీసీలకు అదిక టికెట్లు కేటాయిస్తే సరైన పలితాలు వస్తాయని రిపోర్టులు వచ్చినందున
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన బీసీ నేతలకు వల వెయ్యటానికి కాంగ్రెస్ సిద్ధపడిందని తెలుస్తుంది ఇంతకు ముందు వరకు బీసీలకు రిజర్వ్ అయిన సీట్లలోనే వారికి టికెట్లు ఇచ్చే సంస్కృతి ఉండేది అయితే ఇప్పుడు జనరల్ సీట్లలో కూడా బీసీలకు టికెట్ల కేటాయించి సరైన ఫలితాలు పొందవచ్చు అన్న నమ్మకంతో రాహుల్ ఉన్నారని, ఆయన ఈ దిశగా ఇప్పటికే కీలక నేతలతో మంతనాలు చేశారని వార్తలు వస్తున్నాయి
దేశవ్యాప్తంగా సంఖ్యావ్యాప్తంగా బలంగా ఉన్న బీసీలను సంగటితం చేసి వారికి రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం కల్పించడం ద్వారా ప్రయోజనం పొందాలని ఎత్తుగడ కు కాంగ్రెస్ హై కమాండ్ వచ్చినట్లుగా తెలుస్తుంది.రాజ్యాధికారం సాధించడానికి వారికి ఒక అరుదైన అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేయబోతుందని తద్వారా బహుజన రాజ్యాధికారం దిశగా వారికి దిశ నిర్దేశం చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.మరి కాంగ్రెస్ ఎత్తుగడలు బీసీ వర్గాలను ఏ మేరకు ఆకట్టుకుంటాయో తెలంగాణలో ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి
.