ఎలుకల మీద యుద్ధం ప్రకటించిన న్యూజిలాండ్... ఎందుకంటే?

న్యూజిలాండ్( New Zealand ) ఎలుకల ( mouse )వేటలో పడింది.వన్యప్రాణుల ప్రేమికులందరూ న్యూజిలాండ్ సుందరమైన ద్వీపకల్పం పెనిన్సులాలోని మిరామార్‌లో( Miramar Peninsula ) సమావేశమయ్యారు.

 New Zealand Declared War On Rats Because, New Zealand, War On Rats, Wildlife Lov-TeluguStop.com

వారందరూ ఒక జంతు జాతి నిర్మూలనకై పట్టుబడుతున్నారు.న్యూజీలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌ ప్రాంతంలో పక్షులను రక్షించేందుకు ఎలుకలపై పెద్ద యుద్ధమే ప్రకటించారు.

ఈ మిషన్లో భాగంగా హై-విస్ జాకెట్లు( Hi-vis jackets ) ధరించిన వాలంటీర్లకు ఎలుకలకు ఎర వేసేందుకు విషంతో కూడిన వేరుశెనగలకు వెన్న పూసి ఇస్తారు.దీనికి వారు టెక్నాలజీని వాడుకుంటున్నారు.

జీపీఎస్ యాప్ సహాయంతో ప్రతి డివైజ్‌ దగ్గర ఎలుకలకు ఎర వేసే పదార్థాన్ని ఉంచారు.ఆ సమాచారాన్ని యాప్‌లో అప్‌డేట్ చేస్తారు.

Telugu Latest, Miramar, Zealand, Nri, Peninsula, War Rats, Wildlife Lovers-Telug

ఎలుకలను, ఇతర వేటాడే జంతువులను నిర్మూలించడం కేవలం మిరామార్ లక్ష్యం మాత్రమే కాదు, మొత్తం న్యూజీలాండ్ లక్ష్యంగా పేర్కొంటోంది ఆ దేశం.2050 నాటికి ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.సౌత్ అట్లాంటికాలోని 170 కి.మీల పొడవైన దక్షిణ జార్జియాలో ఇప్పటికే ఎలుకలన్నింటిని తొలగించిన ప్రక్రియ పూర్తయిందట.బ్రిటన్ కంటే అతిపెద్ద ప్రాంతమైన దీనిలో కూడా నిర్దేశించుకున్న సమయం కల్లా సాధిస్తామని న్యూజీలాండ్ పరిరక్షకులు భావిస్తున్నారు.కానీ, కొందరు మాత్రం వారి చర్యను అనైతిక చర్య అని సంబోధిస్తున్నారు.

అయితే ఆ మాటలను న్యూజిలాండ్ ప్రభుత్వం కొట్టి పారేస్తోంది.మాబాధ మీకేం తెలుసంటూ వాదిస్తున్నారు.

Telugu Latest, Miramar, Zealand, Nri, Peninsula, War Rats, Wildlife Lovers-Telug

ఇకపోతే, మనుషులు చివరిగా స్థిరపడిన ప్రాంతంగా న్యూజిలాండ్ కి పేరు.13వ శతాబ్దంలో పాలినేషియన్లు( Polynesians ) అక్కడికి పసిఫిక్ ఎలుకలను తీసుకొచ్చారట.6 శతాబ్దాల తర్వాత, పక్షులకు రక్షణ లేకుండా అవి చేస్తున్నాయని న్యూజిలాండ్ ప్రజలు వాపోతున్నారు.ఇది యూరోపియన్లు చేసిన పాపపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు.

న్యూజీలాండ్‌లో మనుషులు స్థిరపడిన తర్వాత అక్కడ జీవావరణంలోని మూడోవంతు స్థానిక జాతులు కనిపించకుండా పోయాయని సమాచారం.ఒక దాన్ని రక్షించడం కోసం మరోదాన్ని నిర్మూలించడం ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదు.1960ల్లోనే, పర్యావరణ పరిరక్షకులు చిన్న ఆఫ్‌షోర్‌ దీవుల నుంచి ఎలుకలను పూర్తిగా తొలగించారు.కానీ, 2010 వరకు వేటాడే జంతువులను పట్టుకోవడం అనేది ఒక సామాజిక అంశంగా పరిగణించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube