సుఖేష్ చంద్రశేఖర్ ( Sukesh Chandrasekhar )200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈయన పలువురు సినీ సెలబ్రిటీల పేర్లను కూడా బయటకు తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా సుకేష్ చంద్రశేఖర్ ఎప్పుడైతే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారో ఆ క్షణం నుంచి నటి జాక్వెలిన్ ఫెర్నాండిస్ ( Jacqueline Fernandez ) పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.
స్వయంగా సుఖేష్ చంద్రశేఖర్ తాను నటి జాక్వలిన్ కు ఖరీదైన కానుకలు ఇచ్చానంటూ చెప్పుకు రావడం విశేషం.ఇలా ఈ వార్తల ద్వారా ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఈ ఏరియాలో బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా నివసిస్తున్నారు.ముంబైలోని బాంద్రా ప్రాంతంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో మనం 3 BHK ఫ్లాట్ కొనుగోలు చేయాలి అంటే 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందట ఇక ఈమె కొనుగోలు చేసిన కొత్త ఇల్లు ( New Hous ) సుమారు 20 కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం.
ఈ విధంగా నటి జాక్వెలిన్ తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.అయితే ఈమె తన కొత్త ఇంటి గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో పెద్ద ఎత్తున తనపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.ఇది సుఖేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏ కదా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఈ గిఫ్ట్ సుకేష్ ఇచ్చారా లేక సల్మాన్ ఇచ్చారా అంటూ ఈమె ఇంటి ఫోటోల పట్ల నెటిజెన్స్ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు
.