సాయంత్రం మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ..!

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఇవాళ మరోసారి భేటీ కానుంది.ఈ మేరకు ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో ముఖ్యనేతలు సమావేశంకానున్నారు.

 Congress Screening Committee Meeting Once Again In The Evening..!-TeluguStop.com

అభ్యర్థుల రెండో జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుంది.మిగిలిన 64 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ -వామపక్షాల పొత్తు ఖరారుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.పొత్తు నేపథ్యంలో సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచనలో ఉంది.

ఈ క్రమంలో ఇప్పటికే సీపీఐతో రెండు స్థానాలపై కాంగ్రెస్ ఒప్పందం కుదరగా సీపీఎంకి ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీపీఎంకి కేటాయించే సీట్లతో పాటు మిగిలిన అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది.

సీఈసీ ఆమోదం తరువాత కాంగ్రెస్ రెండో జాబితాను ప్రకటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube