సాయంత్రం మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ..!
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఇవాళ మరోసారి భేటీ కానుంది.
ఈ మేరకు ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో ముఖ్యనేతలు సమావేశంకానున్నారు.అభ్యర్థుల రెండో జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుంది.
మిగిలిన 64 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు.అదేవిధంగా కాంగ్రెస్ -వామపక్షాల పొత్తు ఖరారుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పొత్తు నేపథ్యంలో సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచనలో ఉంది.
ఈ క్రమంలో ఇప్పటికే సీపీఐతో రెండు స్థానాలపై కాంగ్రెస్ ఒప్పందం కుదరగా సీపీఎంకి ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీపీఎంకి కేటాయించే సీట్లతో పాటు మిగిలిన అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది.
సీఈసీ ఆమోదం తరువాత కాంగ్రెస్ రెండో జాబితాను ప్రకటించనుంది.